Video: చూస్తుండగానే కుప్పకూలిన F-16 ఫైటర్ జెట్..! అగ్నికి ఆహుతైన పైలెట్ – Telugu News | Tragic F 16 Crash During Rehearsal Cancels Radom Air Show Pilot Lost his Life
గురువారం సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్‌లో వైమానిక ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తుండగా పోలిష్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్ మరణించాడు. ఈ విషాదం తర్వాత వారాంతంలో జరగాల్సిన రాడోమ్ ఎయిర్‌షోను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. జెట్ రన్‌వేపై కూలిపోవడం వల్ల నష్టం వాటిల్లిందని నివేదికలు తెలిపాయి. ప్రభుత్వ ప్రతినిధి ఆడమ్ స్జ్లాప్కా ఎక్స్ వేదికగా పైలట్ మరణాన్ని ధృవీకరించారు. రక్షణ మంత్రి వ్లాడిస్లా కోసినియాక్-కామిస్జ్ క్రాష్ సైట్‌కు వెళుతున్నారని తెలిపారు. … Read more