Site icon Desha Disha

Pawan Kalyan Shocking Role in OG l ఓజి లో పవన్ కళ్యాణ్ పాత్ర ఇదే 2024

Pawan Kalyan Shocking Role in OG:- టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు రాజకీయాలతో పాటు అటు సినిమాలతో కెరీర్ పరంగా ఎంతో బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఓవైపు జనసేన పార్టీ కార్యకలాపాలు చూస్తూనే మరో వైపు సినిమా షూటింగుల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హృద్యమైన సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ మూవీ హరహర వీరమల్లు, గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ అలానే యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ ఓజి లో కూడా నటిస్తున్నారు.

ఈ మూడు సినిమాలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ సైతం భారీ స్థాయి అంచనాలు నెలకొని వున్నాయి. అయితే వీటిలో పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజి మూవీ పైనే మరింతగా ఆశ పెట్టుకున్నారు. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ మూవీ వంటి ప్రతిష్టాత్మక బ్లాక్ బస్టర్ ని అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓజి నిర్మాణమవుతోంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ నటి ప్రియాంక మోహన్ నటిస్తన్నారు.

Pawan Kalyan Shocking Role in OG

అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఈ మూవీలో ఓజాస్ గంభీర అనే గైడ్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారట. అయితే  ఆతరువాత కొన్ని పరిస్థితుల వల్ల అతడు భారీ గ్యాంగస్టర్ గా మారతాడట. కాగా అనంతరం ఒకానొక సందర్భంలో విలన్స్ అతడి ప్రేయసిని చంపటం ఆ పై ఓజాస్ గంభీర వారిపై రివెంజ్ తీర్చుకోవటం అనేటువంటి కదంశంతో ఓజి మూవీ సాగుతుందట. విశేషం ఏమిటంటే ఓజాస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ అత్యద్భుతంగా ఉండటంతో పాటు భారీ మాస్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని ఫాన్స్ ని ఎంతో థ్రిల్ చేస్తాయట.

Pawan Kalyan Shocking Role in OG

ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఓజి మూవీ తదుపరి షెడ్యూల్ వచ్చే ఏడాది ఎన్నికల అనంతరం జరిగే అవకాశం ఉంది. నిజానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండటంతో వరుసగా ఈ మూడు సినిమాల యొక్క షూటింగ్స్ కి ఒక్కసారిగా బ్రేక్ అయితే పడింది. ఇక ఈ మూడు సినిమాల్లో ముందుగా ఓజి, ఆతరువాత ఉస్తాద్ భగత్ సింగ్, చివరగా హరిహర వీరమల్లు థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Pawan Kalyan Shocking Role in OG

Exit mobile version