ABN
, Publish Date – Apr 24 , 2025 | 06:29 PM
Youtuber Shyam: జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుపై యూట్యూబర్ శ్యామ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాదాపు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఓ లేడీని కూడా అరెస్ట్ చేశారు.

Youtuber Shyam
ఎమ్మెల్యేపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో యూట్యూబర్ శ్యామ్ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు రాజేంద్ర నగర్‌లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ శ్యామ్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బండ్లగూడ మ్యాపిల్ టౌన్‌లో ఉంటున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు..
రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించారు. యూట్యూబర్ శ్యామ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్యామ్‌పై ఎక్స్‌టార్షన్ కేసు నమోదు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. శ్యామ్‌తో పాటు ఓ లేడీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, శ్యామ్‌ను కోర్టులో హాజరుపరిచారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: వీసాల రద్దు.. సీమా హైదర్ పాకిస్తాన్ వెళ్లిపోవాల్సిందేనా..
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. అవే రక్తపు బట్టలతో అంత్యక్రియలకు కూతురు..
Updated Date – Apr 24 , 2025 | 06:51 PM