దేశ దిశ

TG Irrigation Division ENC letter to Godavari and Krishna River Administration Boards

TG Irrigation Division ENC letter to Godavari and Krishna River Administration Boards

  • గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు..
  • తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్ లేఖ
  • లేఖలో గోదావరి – బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన
TG Irrigation Division ENC letter to Godavari and Krishna River Administration Boards

గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్ (ఈఎన్సీ) లేఖ రాసింది. గోదావరి – బనకచర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపామని ఈఎన్సీ వెల్లడించింది. పనులు విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని… తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ తెలిపింది.

READ MORE: Ishan Kishan Match Fixing: మనోడు కాదు, పగోడు.. ఇషాన్ ఇంకా ముంబై ఇండియన్స్‌కే ఆడుతున్నాడు!

ఈ నెల ఏడో తేదీన జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించామంది. ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆ రోజు జీఆర్ఎంబీ ఛైర్మన్, ఏపీ సభ్యులు సమాధానం ఇచ్చారని తెలిపింది. కానీ, మరుసటి రోజే గోదావరి – బనకచర్ల లింక్ కోసం ఏపీ ప్రభుత్వం జలహారతి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ ఈఎన్సీ పేర్కొంది. “ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించి ఏపీని నిలువరించాలి. పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతల పథకాలపై ఇందుకు సంబంధించిన ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టవద్దు. కృష్ణా జలాలకు సంబంధించి ట్రైబ్యునల్ లో వాదనలు జరుగుతుండగా… జలాల మళ్లింపు కోసం ఉత్తర్వులు ఇవ్వరాదు. ఏపీ జారీ చేసిన జలహారతి కార్పోరేషన్ ఉత్తర్వులను నిలిపివేసేలా చూడాలి.” అని తెలంగాణ ఈఎన్సీ లేఖలో స్పష్టం చేసింది.

READ MORE: Pahalgam Terror Attack: నా పేరు భరత్.. నేను హిందువుని అనగానే తూటాల వర్షం.. బెంగళూరు టెక్కీ విషాదగాధ

Exit mobile version