TG Govt Takes Motion to Safely Deliver Again Vacationers Stranded in Kashmir

Written by RAJU

Published on:

  • సుర‌క్షితంగా స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు చ‌ర్యలు
  • రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ర్యట‌కుల‌కు త‌గిన సహాయం
  • కొనసాగిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం
  • మరింత సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయాలని సూచన
TG Govt Takes Motion to Safely Deliver Again Vacationers Stranded in Kashmir

కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సుర‌క్షితంగా స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ర్యట‌కుల‌కు త‌గిన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యట‌క శాఖ అధికారులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

READ MORE: Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు

ఇటీవల జమ్ము, కశ్మీర్ లోప్రయాణించిన పర్యటకుల వివరాలు వెంటనే అందించాల‌ని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి జూపల్లి కోరారు. పర్యటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప‌ర్యట‌క శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశామ‌ని, కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ ప‌ర్యట‌కుల స‌హాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. పర్యటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం కింది నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

హెల్ప్ లైన్ నంబ‌ర్లు: 9440816071
: 9010659333
: 040 23450368

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights