- టెన్త్ పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్
- టెన్త్ ఫలితాలను రేపు అనగా 30 ఏప్రిల్ 2025న విడుదల చేయనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు

తెలంగాణలో టెన్త్ ఫలితాల విడుదలపై ఉత్కంఠత వీడింది. పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధం అయింది. రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టెన్త్ ఫలితాలను రేపు అనగా 30 ఏప్రిల్ 2025న విడుదల చేయనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
Also Read:Bheems Ceciroleo: భీమ్స్ పేరులో ‘సిసిరోలియో’ అంటే ఏంటో తెలుసా?
రేపు సీఎం రేవంత్ రెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు, సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌లతో SSC పాస్ సర్టిఫికెట్ జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.