హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణలో (Telangana) భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేడి గాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా.. అధిక ఎండలు, వడగాలులు నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. భానుడు భగభగలతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. అయితే ఈరోజు, రేపు (శుక్రవారం) ఉష్ణోగ్రతలు, వడ గాలులు మరింత పెరగనున్నాయి.
ఈ క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయ్యాయి. ఈరోజు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యాయి. ఈ జిల్లాలో 44 నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.
Hair Growth Scam: బట్టతలపై జుట్టు అంటూ మందు రాశాడు.. చివరకు
రాత్రి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు వడ గాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. వడదెబ్బ మరణాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని.. అవసరం ఉంటేనే ప్రజలు బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
నిన్న అత్యధికంగా నిజామాబాద్ – 44.5 డిగ్రీలు
ఆదిలాబాద్ – 44.3 డిగ్రీలు
మెదక్ – 43.4 డిగ్రీలు
రామగుండం – 42.8 డిగ్రీలు
ఖమ్మం – 41.6 డిగ్రీలు
హనుమకొండ, మహబూబ్‌నగర్ – 41 డిగ్రీలు
భద్రాచలం – 40.2 డిగ్రీలు
నల్గొండ – 40 డిగ్రీలు
హైదరాబాద్ – 40 డిగ్రీలు
ఇవి కూడా చదవండి
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 24 , 2025 | 01:31 PM