దేశ దిశ

Telangana: బంక్‌కి కారులో వచ్చి ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నారు.. కట్ చేస్తే.. – Telugu Information | Run Away With out Paying Cash After Filling Full Tank Gasoline to Automobile in Nadikuda Hanmakonda

Telangana: బంక్‌కి కారులో వచ్చి ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నారు.. కట్ చేస్తే.. – Telugu Information | Run Away With out Paying Cash After Filling Full Tank Gasoline to Automobile in Nadikuda Hanmakonda

దోపిడీదారులు బరి తెగిస్తున్నారు.. విచిత్ర తరహాలో దోపిడీలకు పాల్పడుతున్నారు.. హనుమకొండ జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ లో జరిగిన డీజిల్ దోపిడి ఘటన అంతా షాక్ అయ్యేలా చేసింది.. నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన దుండగులు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు.. డెబిట్ కార్డు స్వైప్ చేస్తామని నమ్మించి సిబ్బందిపై దాడిచేసి ఎస్కేఫ్ పోయారు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆథారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.. వరంగల్ ను వణికిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలే ఈ రకమైన దోపిడీకి పాల్పడ్డారా..! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో జరిగింది.. పరకాల నడికూడ మధ్య ప్రధాన దారి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌కు రాత్రి 10.44 నిమిషాల సమయంలో నెంబర్ ప్లేట్ లేని ఓ కార్ వచ్చింది.. డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించుకొన్నారు.. సుమారు 11 వేల రూపాయల డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు..

స్వైప్ మిషన్ తీసుకురమ్మని బంకు సిబ్బందిని నమ్మించిన కారులోని కేటుగాళ్లు అక్కడినుండి పారి పోయారు.. వారిని వెంబడించిన సిబ్బంది పట్టుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు అతనిపై దాడిచేసి పారిపోయారు. పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు..సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు..

నెంబర్ ప్లేట్ లేని కారు ఎవరిది..? వరంగల్‌ను వణికిస్తున్న అంతరాష్ట్ర దొంగలు ఈ రకమైన దోపిడీ పాల్పడ్డారా.! లేక స్థానికులే ఎవరైనా మద్యం మత్తులో ఈ విధంగా దోపిడీకి బరితెగించారా..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version