న్యూఢిల్లీ: ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP liquor scam case)లో ముందస్తు బెయిల్ (Anticipatory bail) కోసం వైసీపీ ఎంపీ (YCP MP) మిథున్ రెడ్డి (Mithun Reddy) సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ జె.బి.పార్దివాలా (Justice JB Pardiwala), జస్టిస్ ఆర్ మహాదేవన్ (Justice R Mahadevan) ధర్మాసనం (Bench) కేసు విచారణ జరిపింది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై సమాధానానికి సమయం కావాలని మిధున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణ రెండు వారాలు వాయిదా పడింది.
Also Read: Guntur: నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
ఏపీ హైకోర్టులో చుక్కెదురు..
మద్యం కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ మిధున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన ధర్మాసనం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించిన విషయం తెలిసిందే.
మద్యం ప్రకంపనలు..
కాగా ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. వైసీపీలో కీలక నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి చుట్టూ వ్యవహారం అంతా తిరుగుతోంది. శనివారం (ఈ నెల 19వ తేదీ) ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు సిట్ బృందం విచారించింది. మిథున్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, సంతకాలు తీసుకుంది. మద్యం కుంభకోణంలో వివిధ అంశాలపై ఆరా తీసిన సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మరోసారి మిథున్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశముంది. కోర్టు ఆదేశాలతో న్యాయవాది సమక్షంలోనే సిట్ మిథున్‌రెడ్డిని విచారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకం.. అదాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. రాజ్ కసిరెడ్డికి చెందిన అదాన్ డిస్టిలరీ, డికార్ట్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎంతమేర కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించినట్లు తెలిసింది. రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్, అవినాష్ రెడ్డిలతో మిథున్‌రెడ్డికి ఉన్న సంబంధాలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే కొన్ని ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానాలు దాటవేసినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు…
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..
For More AP News and Telugu News
Updated Date – Apr 28 , 2025 | 12:29 PM