
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మన జీవితాలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు వెల్లడించాడు. జీవితాన్ని ఎలా గడపాలి, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి, ఎవరిని విశ్వసించాలి, జీవితంలో విజయం సాధించడానికి ఏం చేయాలి వంటి అనేక విషయాలను ఆయన నీతిశాస్ట్రంలో ప్రస్తావించాడు. అదేవిధంగా మనల్ని హేళన చేసిన వారి ముందే ఎలా ఎదగాలో.. వారిని ఎలా ఎదిరించాలో కూడా నేర్పించారు. మనకు మంచి జరగడం కంటే చెడు జరగాలని కోరుకునే వారు, సహాయం చేయడం కంటే తక్కువ చేసి మాట్లాడేవారు ఎప్పుడూ మన చుట్టూ ఉంటారు. మీ జీవితంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా? అలాంటి వారికి ఇలా బుద్ధి చెప్పండి..
నియంత్రణ సాధన
తన కోరికలను నియంత్రించుకుని, లక్ష్యంపై దృష్టి సారించే వ్యక్తి మాత్రమే విజయం సాధించగలడని చాణక్యుడు చెబుతున్నాడు. చాణక్యుడి ప్రకారం, మీ దృష్టి ఎల్లప్పుడూ లక్ష్యంపైనే ఉండాలి. మీ అభిరుచులను నియంత్రించుకోవడం ద్వారా, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా, మీరు కూడా జీవితంలో విజయం సాధించగలరు. మీ ప్రత్యర్థుల ముందు గర్వంగా నిలబడగలరు.
క్రమశిక్షణ చాలా ముఖ్యం
క్రమశిక్షణ లేనివారు విజయం సాధించలేరు. కాబట్టి జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకోవడం చాలా ముఖ్యం అని చాణక్యుడు చెబుతున్నాడు. కొన్నిసార్లు క్రమశిక్షణ మనల్ని గెలిపించేలా చేస్తుంది. కాబట్టి మీరు మీ బంధువుల ముందు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, క్రమశిక్షణతో లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం.
పరిజ్ఞానం కలిగి ఉండాలి
మొదట జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనకు జ్ఞాన సంపద ఉంటే జ్ఞానం ద్వారా మనం విజయం సాధించగలం. జ్ఞానం, అనుభవం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టమని చాణక్యుడు చెబుతున్నాడు.
ఒకసారి ద్రోహం చేసిన వారిని జీవితంలో నమ్మకూడదు
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ నమ్మకాన్ని ఒకసారి మోసం చేసిన వారిని ఎప్పుడూ నమ్మకూడదు. మీ తదుపరి పనుల గురించి వారికి ఎప్పుడూ చెప్పకూడదు. అలాంటి వ్యక్తులు మీ విజయాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
ఆదాయం – ఖర్చుల గురించి అవగాహన కలిగి ఉండాలి
ఆచార్య చాణక్యుడి ప్రకారం ధనవంతులు కావడానికి.. మొట్టమొదటగా మీ ఆదాయం, ఖర్చుల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. తెలివిగా ఖర్చు చేయాలి. డబ్బును సరైన స్థలంలో పెట్టుబడి పెట్టాలి.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మనం ఎల్లప్పుడూ సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలని చాణక్యుడు చెబుతున్నాడు. సరైన సమయ నిర్వహణ విజయానికి గొప్ప సహకారం అందిస్తుంది. మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా, అందుబాటులో ఉన్న అవకాశాలను, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు.
బంధువుల విమర్శలకు బాధపడకండి
ముఖ్యంగా బంధువులు, కష్ట సమయాల్లోనే కాదు, విజయ సమయాల్లో కూడా తరచుగా విమర్శనాత్మకంగా, వ్యంగ్యంగా మాటలతో హింసిస్తారు. అలాంటి విమర్శలను పట్టించుకోకుండా, విమర్శకుల మాటలకు లొంగకుండా, దృఢంగా నిలబడి మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా, మిమ్మల్ని విమర్శించిన వారి ముందు ఉన్నతంగా నిలబడగలరు.
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.