Star Tortoise: అరుదైన నక్షత్రపు తాబేలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..

Written by RAJU

Published on:

కరీంనగర్: అత్యంత అరుదైన నక్షత్రపు తాబేలు (Rare Star Tortoise) గుడ్లు పెట్టింది (Lays Eggs ). దీంతో అధికారులు (Officials Astonished) ఆశ్చర్యపోతున్నారు. చిన్నారి స్టార్ టార్టాయిస్ కోసం ఎదురుచూస్తున్నారు. అవి ఎక్కడ.. ఏంటి తెలుసుకుందాం…

కరీంనగర్ డీర్ పార్క్‌ (Deer Park)లో అత్యంత అరుదైన ఘటన జరిగింది. వాతావరణం అనుకూలంగా ఉంటే తప్ప.. గుడ్లు పెట్టని నక్షత్రపు తాబేలు ఏకంగా ఐదు గుడ్లు పెట్టింది. ఇది మాములు విషయం కాదని ఫారెస్ట్‌ అధికారులు అంటున్నారు. త్వరలో రాబోయే బుల్లి స్టార్‌ టార్టాయిస్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని డీర్‌ పార్క్ అధికారులు అంటున్నారు.

అరుదైన ఘటన..

సముద్ర తీరంలో మాత్రమే జరిగే అరుదైన ఘటన కరీంనగర్ డీర్ పార్క్‌లో జరిగింది. వాతావరణం అనుకూలంగా ఉంటే తప్ప.. గుడ్లు పెట్టని నక్షత్రపు తాబేలు ఏకంగా ఐదు గుడ్లు పెట్టేసింది. కరీంనగర్‌లోని డీర్ పార్కులో అరుదైన నక్షత్రపు తాబేళ్లను పెంచుతున్నారు అధికారులు. అందులో పెద్ద స్టార్ టార్టాయిస్ ఏకంగా ఐదు గుడ్లు పెట్టింది. దీనిపై డీర్ పార్క్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇది అరుదైన ఘటనగా అభివర్ణిస్తున్నారు. ఐదు గుడ్లు పెట్టిన ఈ నక్షత్రపు తాబేలు వల్ల డీర్‌ పార్క్‌లోకి మరికొన్ని రోజుల్లో మరో ఐదు నక్షత్రపు తాబేళ్లు రాబోతున్నాయి. ఐదు నక్షత్రపు తాబేళ్లు వచ్చే సమయం కోసం డీర్ పార్క్ అధికారులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Also Read..: ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి మద్దతు..

తాబేళ్లలో రెండు రకాలు..

సాధారణంగా తాబేళ్లను రెండు రకాలుగా చూస్తారు. ఒకటి సముద్రపు తాబేళ్లు, రెండు భూమిపై ఉండే తాబేళ్లు. ఈ తాబేళ్లలో మళ్లీ పదుల సంఖ్యలో జాతులు ఉన్నాయి. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో ఐదు జాతుల తాబేళ్లు ఉంటాయి. వాస్తవానికి అవి ఎక్కడ పుడితే తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి. మిగతా జీవితమంతా సముద్రంలోనే గడిపేస్తాయి. కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే తాబేళ్లు భూమి మీదకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వివిధ సముద్ర తీరాల దగ్గర వేలాది తాబేళ్లు బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తుంటాం. వాస్తవానికి సముద్రంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడితేనో, లేక వాటికి గుడ్లు పెట్టే సమయం ఆసన్నమైతే అవి బయటకు వస్తాయి. అందుకే కొన్ని సార్లు వేలాది తాబేళ్లు భూమి మీదకు ఒకేసారి రావడాన్ని చూస్తుంటాం.

ఈ తాబేళ్లు ఎక్కడపడితే అక్కడ గుడ్లు పెట్టవు..

తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సముద్ర తీరంలోని ఇసుక ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంచుకుంటాయి. గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీరాల్లో గుడ్లు పెట్టే తాబేళ్ల కోసం అక్కడి అధికారులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గుడ్లను రక్షించి.. అవి తాబేళ్లుగా మారి.. తిరిగి సముద్రంలోకి వెళ్లే వరకు వాటిని కాపాడుతున్నారు. అయితే కరీంనగర్‌లోని నక్షత్రపు ఆకారపు తాబేళ్లు అలా కాదు. నక్షత్రపు తాబేళ్లు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు గుడ్లు పెట్టవు. వాటికి వాతావరణం నచ్చితేనే గుడ్లు పెడుతాయని అధికారులు చెప్తున్నారు. భూమి మీద ఉండే తాబేళ్లు వాటి మనుగడ ప్రమాదంలో ఉందని భావిస్తే.. సంతానోత్పత్తికి ఆసక్తి చూపవు. అవి సురక్షితంగా ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రమే గుడ్లు పెడతాయని అధికారులు అంటున్నారు.

ప్రత్యేక సంవర్షణ..

కరీంనగర్‌ డీర్ పార్క్‌లో ప్రస్తుతం మూడు స్టార్ టార్టాయిస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎండల దృష్య్టా వీటిని ప్రత్యేకంగా రక్షిస్తున్నారు. ఇవి ఉండే ప్రాంతాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరీంనగర్ డీర్ పార్క్‌లో ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని సిబ్బంది, అధికారులు చెప్తున్నారు. ఇక్కడి వాతావరణం పక్షులకు, జంతువులకు అనుకూలంగా ఉంది కాబట్టే ప్రొడక్షన్‌కు అవకాశం ఇస్తున్నాయని, ఆసక్తి చూపిస్తున్నాయని అంటున్నారు. అందుకే నక్షత్రపు తాబేలు ఐదు గుడ్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. అయితే ఐదు గుడ్లు పొదిగిన తర్వాత అవి తాబేళ్లుగా రూపాంతరం చెందడానికి కొంత సమయం పడుతుందని, ఆ ప్రక్రియ కోసం తాము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..

ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి..

తుపాకీ లాక్కోబోయి.. తూటాలకు బలైపోయి..

For More AP News and Telugu News

Updated Date – Apr 24 , 2025 | 11:38 AM

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights