దేశ దిశ

Shailaja Donempudi: శాస్త్రవేత్త శైలజకు అరుదైన గుర్తింపు

Shailaja Donempudi: శాస్త్రవేత్త శైలజకు అరుదైన గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): సీఎస్ఐఆర్‌ -ఐఐసీటీ పూర్వ శాస్త్రవేత్త డాక్టర్‌ శైలజ దోనెంపూడికి అరుదైన గుర్తింపు లభించింది. ఆమెను విశిష్ట శాస్త్రవేత్త (డిస్టింగ్విష్డ్‌ సైంటి్‌స్ట-డీఎస్‌) హోదాలో నియమించినట్లు సీఎ్‌సఐఆర్‌ మంగళవారం తెలిపింది. ఢిల్లీలోని సీఎ్‌సఐఆర్‌ ప్రధాన కార్యాలయంలో ఆమె బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ గ్రూప్‌ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. ఆమె సోమవారం బాధ్యతలు చేపట్టారు. సీఎ్‌సఐఆర్‌ (శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి) చరిత్రలో ఒక మహిళ డీఎ్‌సగా ఎంపిక కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ (భారతీయ రసాయన విజ్ఞాన సంస్థ)తో ఆమె అనుబంధం 1993లో మొదలైంది.

ఉస్మానియా యూనివర్సిటీలో పాలిమర్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన ఆమె, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి ఎంఎ్‌ససీ, ఎంఫిల్‌ చేశారు. తన 28 ఏళ్ల కెరీర్‌లో పాలిమర్‌ సింథసిస్‌, సాంకేతికత, పరిశోధనలకు తోడ్పాటునందించారు. దీనికి గుర్తింపుగా 1996లో ఆమెకు సీఎ్‌సఐర్‌- దాద్‌ ఫెలోషిష్‌ లభించింది. జర్మనీలోని కీల్‌ యూనివర్సిటీలో పరిశోధనలు చేసేందుకు ఈ ఫెలోషిప్‌ తోడ్పడింది. పాలిమర్‌ కెమిస్ట్రీలో ఆమె పరిశోధనా ఫలాలు అనే పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆమె 2017 నుంచి సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీలో బిజినెస్‌ డెవల్‌పమెంట్‌, రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతిగా కూడా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date – Apr 30 , 2025 | 04:51 AM

Exit mobile version