దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో భారీగా రైల్వో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి రైల్వే శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు రేపట్నుంచి (ఏప్రిల్ 12) ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.. రైల్వే రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
ఆర్‌ఆర్‌బీ జోన్ల వారీగా ఖాళీల వివరాలు..
- సెంట్రల్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 376
- ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 700
- ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 1,461
- ఈస్ట్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 868
- నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 100
- నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 125
- నార్తన్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 521
- సౌత్ వెస్ట్రన్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 679
- సౌత్ సెంట్రల్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 989
- సౌత్ ఈస్ట్‌సెంట్రల్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 568
- సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 921
- సధరన్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 510
- వెస్ట్ సెంట్రల్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 759
- వెస్ట్రన్ రైల్వేలో పోస్టుల సంఖ్య: 885
- మెట్రో రైల్వే కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 225
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 01,2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో మే 11, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష విధానం
సీబీటీ 1 పరీక్ష మొత్తం 75 ప్రశ్నలకు 75 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్ష మొత్తం 60 నిమిషాలపాట జరుగుతుంది. ఇక సీబీటీ 2లో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో 90 నిమిషాల వ్యవధిలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల నుంచి ఇచ్చే 100 ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. పార్ట్ బి విభాగానికి 60 నిమిషాల వ్యవధిలో సంబంధిత ట్రేడ్ సిలబస్ నుంచి ఇచ్చే 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. దీనికి కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.