- భారత్ దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ కుదేల్
- ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు

పహల్గామ్ దాడి తర్వాత దయాది దేశంపై భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాక్ స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోయింది. గురువారం మార్కెట్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ (KSE-100) 2.12 శాతం మేర పడిపోయింది. అంటే దాదాపు 2,485 పాయింట్లు క్షీణించి 114,740.29కి చేరుకుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. దీంతో భారీగా నష్టాలు చవిచూసింది. ప్రారంభమైన 5 నిమిషాల్లో ఇంత నష్టాన్ని ఎదుర్కొంది.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్ సభలో పాల్గొన్న మోడీ
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాక్ దౌత్యవేత్తలను పంపించేసింది. అలాగే వీసాలను ఉపసంహరించుకుంది. అంతేకాకుండా వాఘా-అటారీ బోర్డర్ మూసివేసింది. ఇలా వెనువెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాక్ స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో సంబరాలు.. కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి (వీడియో)
మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఇక మృతదేహాలను అధికారులు స్వస్థలాలకు తరలించారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ నుంచి టూరిస్టులు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇక ఉగ్ర దాడికి నిరసనగా గురువారం కాశ్మీర్‌లో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. చిక్కుకున్న టూరిస్టులకు 15 రోజులు ఉచిత బస కల్పిస్తామని హోటళ్లు ముందుకొచ్చాయి.
ఇది కూడా చదవండి: TG Govt : అలర్ట్.. కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యటకుల కోసం హెల్ప్‌లైన్