- పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్ టూరిజంపై తీవ్ర ప్రభావం..
- పర్యాటకులే లక్ష్యంగా ముష్కరుల కాల్పులు..
- ఈ సమ్మర్ సీజన్ లో రద్దవుతున్న బుకింగ్స్..
- కొన్ని గంటల్లోనే కాశ్మీర్ టూర్ ను రద్దు చేసుకున్న 25 శాతం మంది టూరిస్టులు..
- ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి 10 వేల మంది జమ్మూకు పయనం..
- ఉగ్రదాడిలో తెలుగ వాళ్లు కూడా చనిపోవడంతో ఆందోళన..

Kashmir Tourism: మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టులపై జరిగిన దాడితో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో జమ్మూలో టెర్రరిస్టుల ఆచూకీ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా, స్విట్జర్లాండ్‌లోని లంగెర్న్ ప్రాంతంలా అనిపించడంతో పహల్గాంని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. పచ్చదనం పరుచుకున్నట్టు ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కావడంతో మన దేశంలోని పర్యాటకులతో పాటు దేశీయులు కూడా భారీగా తరలి వస్తుంటారు.
Read Also: Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రోజే.. ‘‘కాశ్మీర్’’పై టర్కీకి థాంక్స్ చెప్పిన పాకిస్తాన్..
అయితే, పహల్గామ్ ఉగ్ర దాడితో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. దీని వల్ల కాశ్మీరీల ఉపాధితో పాటు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ దాడి జరగడంతో ఇక్కడికి వచ్చేందుకు టూరిస్టులు భయపడుతున్నారు. అయితే, ఇప్పటికే కశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకున్నారు. ట్రావెల్ టికెట్లు మాత్రమే కాదు..స్థానికంగా హోటళ్లలో వసతి కోసం బుక్ చేసుకున్నవి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
Read Also: Ponnam Prabhakar : ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పథకం
ఇక, ఈ సమ్మర్ లో పహల్గామ్ ఎంజాయ్ చేద్దామని సిద్ధమై.. ముందస్తు బుకింగ్స్ చేసుకున్న టూరిస్టులు తమ బుక్సింగ్స్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే కాశ్మీర్ టూర్ ను 25 శాతం మంది పర్యాటకులు రద్దు చేసుకున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లడానికి రెడీ అయినా సుమారు 10 వేల మంది తమ బుక్సింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. ఈ ఉగ్ర దాడిలో తెలుగ వాళ్లు కూడా చనిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.