దేశ దిశ

Mounted deposits: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీతో అధిక ఆదాయం.. నమ్మలేని వడ్డీ రేటు ఇదే..! – Telugu Information | Rates of interest provided by banks on fastened deposits, examine particulars in telugu

Mounted deposits: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీతో అధిక ఆదాయం.. నమ్మలేని వడ్డీ రేటు ఇదే..! – Telugu Information | Rates of interest provided by banks on fastened deposits, examine particulars in telugu

నిర్ణీత కాలానికి వడ్డీతో సహా అసలు తీసుకునే అవకాశమున్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు ఎక్కువ ఆధారపడతారు. వాటి నుంచి వచ్చే వడ్డీరేటు లెక్కించుకుని, ఎక్కువ ఇచ్చే బ్యాంకులో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. కాగా.. రూ.3 కోట్ల డిపాజిట్లపై కాలపరిమితి ఆధారంగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 7.75 శాతం, ఐసీఐసీఐలో 7.85 శాతం, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 7.50 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హెచ్ డీఎఫ్ సీ

  • ఏడు రోజుల నుంచి 14 రోజుల వరకూ సాధారణ ప్రజలకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ అందిస్తున్నారు.
  • ఏడాది నుంచి 15 నెలల కంటే తక్కు కాలపరిమితి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం.
  • రెండేళ్ల నుంచి 2 ఏళ్ల 11 నెలల కన్నా తక్కువ సమయంలో సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
  • మూడేళ్ల నుంచి నాలుగేళ్ల ఏడు నెలల కంటే తక్కువ కాలపరిమితికి సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
  • ఐదేళ్ల ఒక్క రోజు నుంచి పదేళ్ల వరకూ సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.

స్టేట్ బ్యాంకు

  • ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకూ సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ అందిస్తారు.
  • ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి సాధారణ ప్రజలకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం.
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల కంటే తక్కువ సమయం డిపాజిట్లపై 6.90 శాతం, 7.40 శాతం
  • మూడేళ్ల నుంచి ఐదేళ్ల డిపాజిట్లపై 6.75 శాతం, 7.25 శాతం.
  • ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకూ సాధారణ ప్రజలకు 6.50 శాతం, సినియర్ సిటిజన్లకు7.50 శాతం వడ్డీ ఇస్తారు.

ఐసీఐసీఐ

  • ఏడు నుంచి 29 రోజుల వరకూ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం.
  • ఏడాది నుంచి 15 నెలల కంటే తక్కువ సమయానికి 6.70 శాతం, 7.20 శాతం.
  • 18 నెలల నుంచి రెండేళ్ల వరకూ 7.25 శాతం, 7.75 శాతం.
  • రెండేళ్ల ఒక్క రోజు నుంచి ఐదు సంవత్సరాల వరకూ 7 శాతం, 7.50 శాతం.
  • ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకూ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం వడ్డీ అందిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Exit mobile version