ABN
, Publish Date – Apr 24 , 2025 | 06:13 AM
ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ముస్కాన్ బేగం 994 మార్కులతో టాపర్‌గా నిలిచింది. గురుకులాల విద్యార్థులు అనేక మంది ఉత్సాహకరమైన ఫలితాలను సాధించారు

హైదరాబాద్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో గద్వాల విద్యార్థిని ముస్కాన్ బేగం 994 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ముస్కాన్ తండ్రి ఆటో డ్రైవర్. కరీంనగర్, మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్ గురుకులాల విద్యార్థులు జి.చరణ్ తేజ, అనామిక, ధానియా బాను, నుస్బా సుల్తానా, సీ వాసవి 993 మార్కులు సాధించారు. బైపీసీ ప్రథమ సంవత్సరంలో రంజాన్ బీ (కొత్తగూడెం), వజీహా తబస్సుమ్ (రంగారెడ్డి జిల్లా రాంజేంద్రనగర్), సఫూరా సిద్దీఖా (వికారాబాద్), ధరణి (మిర్యాలగూడ), ఆయెషా బేగం (హైదరాబాద్ ఆసి్‌ఫనగర్) 440 మార్కులకు 438 సాధించారు. ఆరుగురు విద్యార్థులు 437 మార్కులు, 12 మంది 436 మార్కులు సాధించారు.
ఇవి కూడా చదవండి
PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 24 , 2025 | 06:13 AM