Lease Home Probles: అద్దె ఇంట్లో ఉంటున్నారా ఈ పొరపాటు చేస్తే మీ కొంప కొల్లేరే

Written by RAJU

Published on:

వేతన జీవుల్లో ఎక్కువ మంది నివసించేది అద్దె ఇళ్లల్లోనే ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరాలు, పట్టణాల్లో నివసించేవారిలో అద్దె ఇంట్లో ఉంటున్నవారి శాతం ఎక్కువుగా ఉంటుంది. సాధారణంగా మధ్య తరగతి కుటుంబానికి ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. వారికి వచ్చే చాలీచాలని జీతంతోనే వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు.

ఇంట్లో అవసరమైన వస్తువులను కొనుక్కోవడానికి తొలి ప్రాధన్యత ఇస్తారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్, టీవీ సాధారణ వస్తువుగా మారిపోయింది. మరికొంతమంది వాషింగ్ మెషిన్‌కు రెండు, మూడో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇంటికి అవసరమైన వస్తువులు ఒక్కొక్కటి కొనుగోలు చేసిన తర్వాత చాలామంది ఏసీ కొనాలని అనుకుంటుంటారు. అసలే వేసవికాలం. ఎండలు మండిపోతున్నాయి. ఈక్రమంలో ఏసీ కొనాలనే కోరిక చాలామందికి ఉంటుంది. సొంత ఇళ్లు ఉన్నవాళ్లు ఏసీ కొనుక్కోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాని అద్దె ఇంట్లో ఉంటున్నవాళ్లు ఏసీ కొనుక్కోవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎక్కువ ఖరీదైన వస్తువు కావడంతో కిరాయి ఇంట్లో ఉంటున్న వ్యక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియక పొరపాటుచేస్తే దానికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది.

ఏసీ కొనగోలు చేయవచ్చా

అద్దె ఇంట్లో ఉంటున్న వ్యక్తులు తప్పనిసరైతే ఏసీ కొనుగోలు చేసుకోవచ్చు.కానీ దీనికి ముందు ప్రత్యామ్నాయం ఉంటే వాటి గురించి ఆలోచించడం మేలు. కొంతమంది సరైన అవగహన లేక మొదటి ఏసీ కొని తర్వాత ఇబ్బందులు పడుతుంటారు. ఏసీ కొనాలనే ఆలోచన వస్తే ముందుగా ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో కచ్చితంగా మరో పదేళ్లు ఉంటామనే నమ్మకం ఉంటే ఏసీ కొనుగోలు చేయవచ్చు. తరచుగా ఇళ్లు మారే అలవాటు ఉంటే మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహారించాలి. ఇళ్లు మారేటప్పుడు ఏసీని మనతో తీసుకెళ్లాలంటే అన్ ఇన్‌స్టాల్ చేసి మళ్లీ వేరే ఇంట్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీనికోసం సుమారు రూ.5వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. తరచూ ఏసీని మార్చడం వలన గ్యాస్ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. ఏడాదిలో రెండుసార్లు ఇళ్లు మారితే రూ.10 నుంచి రూ.15వేల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కల్లో ఇన్‌స్టలేషన్, అన్ ఇన్‌స్టేషన్ ఛార్జీలు అధికమయ్యే అవకాశం ఉంది. దీనిద్వారా ఏసీ అసలు ధర కంటే కొసరు ధర ఎక్కవని బాధపడాల్సి వస్తుంది.

ప్రత్యామ్నాయం బెటర్

అద్దె ఇళ్లల్లో ఉండే వ్యక్తులు ఏసీ కొనాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మంచిది. తప్పకుండా ఏసీ కొనాలంటే ప్రస్తుతం ఎక్కడికైనా సులభంగా మార్చుకోగలిగే టవర్(స్టాండింగ్) ఏసీని ఎంచుకోవచ్చు. లేదంటే కూలర్ మంచి ఎంపిక కావచ్చు. కూలర్‌లో ఎన్నో రకాలు వచ్చాయి. ఐస్ క్యూబ్స్‌ వేసుకునే కూలర్లు వచ్చాయి. ఇలాంటి కూలర్లు తీసుకుంటే చల్లదనం ఎక్కువుగా ఉండే అవకాశం ఉంటుంది. హైస్పీడ్ ఫ్యాన్లు కూడా మంచి ఎంపిక అవుతుంది. సాధారణంగా వేసవికాలంలో మాత్రమే ఏసీని ఎక్కువుగా ఉపయోగిస్తారు. చలికాలం పెద్దగా ఉపయోగించరు. ఇలాంటి పరిస్థితుల్లో అద్దె ఇళ్లల్లో ఉండే వారు తమ అవసరం ఆధారంగా నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

శాంతికి మేం సిద్ధం!

కొత్త తల్లులు గిల్ట్‌ లేకుండా..

Sangareddy: రాతి గుండె తల్లి

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date – Apr 03 , 2025 | 12:00 PM

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights