అతను కరుడు గట్టిన నిందితుడు, ఒకటి రెండు కాదు ఏకంగా 22 కేసుల్లో ముద్దాయి. 2019 నుంచి నంద్యాల, గుంటూరు జిల్లాల్లో యదేచ్చగా దారి దోపిడిలు, చోరిలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వెల్లడించిన వివరాల ప్రకారం. పాణ్యం మండలానికి చెందిన చెంచు హనుమంతు అనే వ్యక్తి 2019 నుండి ఇప్పటి వరకు నంద్యాల, గుంటూర్ జిల్లాల్లో దారిదోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకుండా తప్పించుకొని తిరుగుతున్న హనుమంతును సుగాలిమెట్ట గ్రామ సమీపంలోని జంబులమ్మ గుడివద్ద అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన సమయంలో అతని వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు.
తాగుడు, జల్సాలకు అలావాటు పడిన చెంచు హన్మంతు ఈజీ మనీ కొసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన
దాసరి అంకన్న, చెంచు సుంకన్న, హరిచంద్రుడు అనే నలుగురి వ్యక్తులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి దోపిడిలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా పాణ్యం, నంద్యాల చుట్టు పక్కల గ్రామాల్లో దారిదోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్మును సమానంగా పంచుకొనేవారని.. వీరిపై నంద్యాల జిల్లాలో 22 కేసులు ఉన్నట్టు తెలిపారు.
2019 నుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించు తిరుగుతున్న ముద్దాయి హనుమంతు ను పట్టుకున్న నంద్యాల జిల్లా పోలీసులను కర్నూల్ డిఐజి కోయల ప్రవీణ్ కుమార్ (IPS) అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…