JEE Main Session 2 Answer Key 2025 : జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. ఈక్రమంలో అధికారిక ఆన్సర్ కీ విడుదలకు ఎన్‌టీఏ సిద్ధమవుతోంది.

Joint Entrance Examination JEE Main ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో పేపర్-1 (బీఈ, బీటెక్) పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా.. ఏప్రిల్ 9న పేపర్-2 ఏ (బీఆర్క్), పేపర్-2బీ (బీ ప్లానింగ్), పేపర్-2 ఏ, 2 బీ (బీఆర్క్, బీ ప్లానింగ్ రెండింటికి) పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో మొదటి షిఫ్ట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించారు. సెకండ్ షిఫ్ట్ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగాయి. దేశవ్యాప్తంగా 15 నగరాల్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు నిర్వహించేందుకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు అభ్యర్థులు అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ చూడొచ్చు.
ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్లు
దేశవ్యాప్తంగా ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో బీఈ/ బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్స్ (Joint Entrance Examination JEE Advanced) పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఈ పరీక్షకు ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అనంతరం మే 11న హాల్‌టికెట్లు విడుదల చేస్తారు. తర్వాత 2025 మే 18వ తేదీన రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. మే 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు.
అనతరం మే 22న రెస్పాన్స్ షీట్లు, మే 26న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. అనంతరం జూన్ 2న ఫైనల్ కీ, రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. తర్వాత జూన్ 3 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం అభ్యర్థులు రెండు పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో పరీక్ష జరుగుతుంది. ఒక అభ్యర్థి రెండేళ్లలో గరిష్టంగా రెండు సార్లు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కావొచ్చు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు టైమ్ టేబుల్‌తో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను https://jeeadv.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.