దేశ దిశ

Jagga Reddy: క్యాన్సర్‌ పరీక్షల నిర్ణయం అభినందనీయం


ABN
, Publish Date – Apr 22 , 2025 | 03:58 AM

క్యాన్సర్‌ వ్యాధిని ముందుగా గుర్తించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రశంసించారు.

Jagga Reddy: క్యాన్సర్‌ పరీక్షల  నిర్ణయం అభినందనీయం

పల్లె, పట్టణాల్లో చేయాలనే ఆలోచన అద్భుతం వ్యాధిపై భయాన్ని పోగొడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

  • సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదరకు కృతజ్ఞతలు

  • పేద, మధ్య తరగతికి సర్కారు భరోసా: జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): క్యాన్సర్‌ వ్యాధిని ముందుగా గుర్తించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడున్న ఆధునిక పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను ముందే గుర్తించి, దాన్నుంచి బయటపడే అవకాశం ఉందని జగ్గారెడ్డి అన్నారు. అయితే, ముందుగానే గుర్తించే సదుపాయాలు లేనందు వల్ల చాలా మంది మహిళలు సర్వైకల్‌, రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

ఇరవై ఏళ్లుగా క్యాన్సర్‌ బాధిత కుటుంబాలను తాను చూస్తున్నానని, అలాంటి వారిని ఎలా ఆదుకోవాలో ఆలోచించేవాడినని జగ్గారెడ్డి చెప్పారు. పేద, మధ్య తరగతి వర్గాల్లో క్యాన్సర్‌పై ఉన్న భయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పోగొడుతుందని పేర్కొన్నారు. లక్షల కుటుంబాలకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. క్యాన్సర్‌పై అవగాహన లేక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని, ఈ నిర్ణయంతో అనేక మందికి ఊరట కలుగుతుందని జగ్గారెడ్డి తెలిపారు.

Updated Date – Apr 22 , 2025 | 03:58 AM

Exit mobile version