IPL 2025: కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్‌ను భయపెడుతున్న బౌలర్‌ అతనే! అంబటి రాయుడు షాకింగ్‌ కామెంట్స్‌

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు ప్లే ఆఫ్‌ స్థానాల కోసం ఏకంగా 8 జట్లు ఇప్పటికీ పోటీ పడుతున్నాయి. టోర్నీ దాదాపు 70 శాతంపైనే పూర్తి అయింది. అయినా కూడా ఇంకా ప్లే ఆఫ్స్‌కు ఒక్క టీమ్‌ కూడా అధికారికంగా క్వాలిఫై కాలేందంటే పోటీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ సీజన్‌ ఆరంభంలో వరుసగా ఓటములతో తడబడిన ముంబై ఇండియన్స్‌ తర్వాత పుంజుకొని వరుస విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో 10 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 6 విజయాలు సాధించి.. 12 పాయింట్లతో పాటు మిగతా అన్ని టీమ్స్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌తో ఉంది.

ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ గురించి ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్‌ ఓ బౌలర్‌ను ఎదుర్కొలేక చేతులెత్తేసిందని, టీమ్‌ మీటింగ్‌లో అతని గురించి చర్చ వచ్చిన ప్రతీసారి, అతన్ని బౌలింగ్‌ను ఎదుర్కొవాలో సరైన ప్లాన్‌ లేక, అతనొక్కడని జాగ్రత్తగా చూసి ఆడాలని డిసైడ్‌ అయిపోయినట్లు రాయుడు పేర్కొన్నాడు. ఆ బౌలర్‌ మరెవరో కాదు.. విండీస్‌ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌. ఐపీఎల్‌లో ఎన్నో ఏళ్ల నుంచి కేకేఆర్‌కు ఆడుతున్న నరైన్‌.. ఇంకా మిస్టరీ స్పిన్నర్‌గానే కొనసాగుతున్నాడు. అతని బౌలింగ్‌ స్టార్టింగ్‌లో ఎంత కష్టంగా ఉండేదో ఇప్పటికీ చాలా మంది బ్యాటర్లకు అంతే ఇబ్బంది కరంగా ఉంది. అందుకే.. నరైన్‌ కేకేఆర్‌కు ఆస్థాన స్పిన్నర్‌గా మారిపోయాడు. తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కేకేఆర్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

200 ప్లస్‌ టార్కెట్‌ను అందుకోవడానికి డీసీ దూసుకెళ్తుంటే.. తన మిస్టరీ బౌలింగ్‌తో బ్రేక్‌కు వేశాడు. 3 కీలక వికెట్లు తీసి, డీసీకి విజయం దూరం చేసి, కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్‌ను గెలిపించి, ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచాడు. ఈ మ్యాచ్‌ తర్వాత కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అంబటి రాయుడు నరైన్‌ విషయంలో ముంబై ఇండియన్స్‌ టీమ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగిన మీటింగ్స్‌ గురించి బయటపెట్టాడు. రాయుడు 2010 నుంచి 2017 వరకు 8 సీజన్లు ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ముంబై టీమ్‌తో చాలా కాలం ప్రయాణించిన తనూ చెప్పిన ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా ముంబై ఇండియన్స్‌ను భయపెట్టిన, భయపెడుతున్న బౌలర్‌గా నరైన్‌ గురించి చెప్పుకోచ్చు. నరైన్ ముంబై ఇండియన్స్‌పై 26 మ్యాచ్‌ల్లో 6.65 ఎకానమీ రేటుతో 31 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights