- పాక్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం ప్రయాణ సూచన..
- వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు..

India: పాకిస్తాన్‌లో ఉన్న భారతీయలు వెంటనే దేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారతీయులకు కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌లో ఉన్న భారతీయులకు ఈ సూచనల్ని జారీ చేసింది. మరోవైపు, పాకిస్తాన్‌పై భారీ చర్యలు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు మొదలు పెట్టిన భారత్, సైనిక చర్యకు దిగుతుందనే సమాచారం వస్తోంది.
Read Also: Visas to Pak: పాక్ జాతీయులకు వీసాలపై భారత్ సంచలన నిర్ణయం..
‘‘భారత పౌరులు పాకిస్తాన్‌కు ప్రయాణించకుండా ఉండాలని గట్టిగా సలహా ఇస్తున్నాము. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ పౌరులు కూడా వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి రావాలని సూచిస్తున్నాము’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఈ సలహా జారీ చేసింది. మరోవైపు, భారత్ పాకిస్తాన్ జాతీయులకు వీసాలను నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరులకు జారీ చేయబడిన అన్ని భారతీయ వీసాలు ఏప్రిల్ 27, 2025 నుండి రద్దు చేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ముందుగా జారీ చేయబడిన వైద్య వీసాలు ఏప్రిల్ 29, 2025 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాకిస్తానీ జాతీయులు కొత్త నిబంధనల ప్రకారం వారి వీసాల గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లాలని చెప్పింది.