దేశ దిశ

IG Chandrasekhar: ఆ ఆపరేషన్‌తో తెలంగాణకు సంబంధం లేదు

IG Chandrasekhar: ఆ ఆపరేషన్‌తో తెలంగాణకు సంబంధం లేదు

వరంగల్, ఏప్రిల్ 24: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. అనేక చోట్ల జరిగిన ఎన్‌‌కౌంటర్‌లో మావోయిస్టుల ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు అగ్రనేతలు కూడా కాల్పుల్లో నేలకొరుగుతున్న పరిస్థితి. దీంతో మావోయిస్టు పార్టీ బలం క్షీణిస్తూ వస్తోంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు లొంగుబాటు బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండ్ అవుతున్నారు. ఈరోజు తాజాగా 14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటుపై మల్లీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈరోజు 14 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇప్పటి వరకు ఈఏడాదిలో 250 మంది వరకు మావోయిస్టుల లొంగిపోయినట్లు చెప్పారు. వారిలో ఇద్దరు ఏరియా కమిటీ కమాండర్‌లు ఉన్నారన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇక.. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్‌కు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలు అక్కడి ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని తెలిపారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దగ్గర లేదని స్పష్టం చేశారు. వెంకటాపూర్‌కు ఛత్తీస్‌గఢ్ అధికారులు వచ్చి వెళ్తున్నారని చెప్పారు.కానీ తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మావోయిస్టులు హింసాయుతమైన పంథా వీడాలన్నారు. శాంతియుతంగా లొంగిపోవాలని కోరుతున్నామన్నారు. సరెండర్లను ప్రోత్సహించాలనేదే తమ లక్ష్యమని వెల్లడించారు. లొంగుబాట్లను మాత్రమే పోత్రహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ నుంచి 95 మంది మావోయిస్టులు అండర్ గ్రౌండ్‌లో ఉన్నారని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

Tirumala High Alert: పహల్గామ్ దాడితో తిరుమలలో అలర్ట్

మరోవైపు తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఈరోజు మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. దాదాపు 145 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో గత మూడు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు మూడు వేల మంది వరకు మావోయిస్టులు అక్కడ ఉన్నారని గుర్తించారు. ఈ క్రమంలో కర్రెగుట్టల చుట్టూ పది వేల నుంచి పన్నెండు వేల మంది బలగాలు మోహరించి ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్

Telangana Heatwave: భగ్గుమంటున్న ఎండలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Exit mobile version