ఐ ఫోన ఎగుమతుల్లో 25వ త్రైమాసికంలో 3 మిలియన్ యూనిట్లను అధిగమించి యాపిల్ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద మొదటి త్రైమాసిక షిప్‌మెంట్‌లను నమోదు చేసిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే నో కాస్ట్ ఈఎంఐలు, క్యాష్‌బ్యాక్, ఈ-టైలర్ డిస్కౌంట్‌లు వంటి కారణాల వల్ల రెండంకెల వృద్ధిని ప్రోత్సహించాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. విస్తృత డిస్కౌంట్లు, ధరల కోతల వల్ల ఈ త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మధ్యలో సింగిల్ డిజిట్ కుదించే అవకాశం ఉన్నప్పటికీ ఈ మైలురాయిను యాపిల్ సాధించింది. బడ్జెట్ అనుకూలమైన ఐఫోన్ 16ఈతో సహా కొత్తగా ప్రారంభించిన ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాల పెరుగుదలకు కారణమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఎగుమతుల్లో కూడా సగానికి పైగా వీటి వాటా ఉందని చెబుతున్నారు.
2024 నుంచి భారతదేశంలో ఐఫోన్ మార్కెట్ వృద్ధి కొనసాగుతుంది. ఆ సమయంలో ఐఫోన్ 15, 13 మోడల్స్ అమ్మకాలు వేగంగా సాగాయి. అయితే ఐడీసీ ఇంకా పూర్తి డేటాను విడుదల చేయనప్పటికీ జనవరి, ఫిబ్రవరి నెలల గణాంకాలు సంవత్సరానికి 8.1 శాతం తగ్గుదలని సూచిస్తున్నాయి. ముఖ్యంగా డిస్కౌంట్లు ప్రకటించినా వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే భారతదేశంలోని అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు వివో, శామ్‌సంగ్ వరుసగా 2.7 శాతం, 19.5 శాతం తగ్గుదలలను చవిచూశాయి. అయితే అనూహ్యంగా ఒప్పో, రియల్‌మీ వరుసగా 14.3 శాతం, 5.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ వాటా పరంగా నాలుగో స్థానంలో ఉంది. అలాగే 36.1 శాతంతో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. 2024లో భారతదేశం యాపిల్‌కు ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది.
అమెరికా, చైనా, జపాన్ తర్వాత షిప్‌మెంట్‌లు రికార్డు స్థాయిలో 12 మిలియన్ యూనిట్లను తాకాయి. అంటే 35 శాతం వృద్ధిని సాధించాయి. 2024 నాలుగో త్రైమాసికంలో ఆపిల్ మొదటిసారిగా భారతదేశంలోని టాప్ ఐదు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలోకి 10 శాతం మార్కెట్ వాటాతో ప్రవేశించింది. 2023 ప్రారంభం నుంచి కుపెర్టినో ఆధారిత కంపెనీ భారతదేశంలో త్రైమాసిక అమ్మకాల రికార్డులను స్థిరంగా బద్దలు కొడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మరింత బలమైన ఆదాయం, లాభాల వృద్ధికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ అమ్మకాలు 2025 నాటికి 13-14 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
భారతదే దేశంలో తన మూలాలను మరింతగా పెంచుకోవడం ద్వారా తన ర్యాంకింగ్‌ను పటిష్టం చేసుకోవాలని యాపిల్ ప్రయత్నిస్తోంది. కీలక నగరాల్లో నియామకాలను వేగవంతం చేస్తూనే, కంపెనీ తన స్థానిక తయారీ, రిటైల్ ఉనికిని దూకుడుగా విస్తరిస్తోంది. భారతదేశంలో 3,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న ఈ కంపెనీ బెంగళూరు, పూణే, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబైలలో రాబోయే నాలుగు స్టోర్‌లతో సహా తయారీ, రిటైల్ విస్తరణకు సంబంధించిన వందలాది ఉద్యోగ నియామకాలను పూర్తి చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..