Guntur: గ్రామీణ ప్రాంతానికి అత్యుత్తుమ వైద్యం.. గుంటూరు వైద్యుడికి సర్థార్ పటేల్ యూనిటీ అవార్డ్ – Telugu Information | Dr Patibandla Mohan Rao receives an award from CM Dr. Pramod Sawant on the Sardar Patel Unity Awards 2025 in Goa

Written by RAJU

Published on:

Dr. Mohana Rao Patibandla

గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ పాటిబండ్ల మోహన్ రావుకు అరుదైన అవార్డు దక్కింది.  మినిమల్లి ఇన్వాసివ్ న్యూరోసర్జన్‌గా ఆయన సేవలను గుర్తించిన టాప్ నాచ్ పౌండేషన్ ఆయన్ను సర్థార్ పటేల్ యూనిటీ అవార్డ్‌కి ఎంపిక చేసింది. అత్యాధునికి వైద్య విధానాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో మోహన్ రావు గుంటూరు సిటిలో రావూస్ ఆస్పత్రి ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. బ్రెయిన్ పాత్ సిస్టమ్ ద్వారా న్యూరో సర్జరి విభాగంలో అనేక క్లిష్టతరమైన శస్త్ర చికిత్సలను అతి తక్కువ ఖర్చుతోనే అందిస్తున్నారు. దీంతో ఈ ఆసుపత్రికి వివిధ రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు.

దేశంలో వివిధ ప్రాంతాల నుండే కాకుండా విదేశాలకు చెందిన రోగులు కూడా రావూస్ హస్పిటల్‌కు శస్త్రచికిత్సల కోసం వస్తున్నారు. ఇజ్రాయేల్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలను నుండే కాకుండా ఆఫ్రికా దేశాలకు చెందిన రోగులు కూడా గుంటూరుకు వైద్యం కోసం వస్తున్నారు. చిన్న నగరమైనా గుంటూరు అతి ఖర్చుతో అత్యుత్తమైన శస్త్ర చికిత్సలు చేస్తున్న వైద్యుడిగా మోహన్ రావు పేరు గాంచారు. అమెరికాలో న్యూరో సర్జరీ విభాగంలో అనుభవాన్ని సంపాదించిన డాక్టర్ మోహన్ రావు అక్కడ నుండి తమ సొంత ప్రాంతమైన గుంటూరుకు వచ్చి ఇక్కడే ఆసుపత్రిని ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు.

టాప్ నాచ్ పౌండేషన్ కూడా ఆరోగ్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డ్స్ అందిస్తుంది. రెండో రోజుల క్రితం గోవాలో జరిగిన కార్యక్రమంలో గోవా సిఎం ప్రమోద్ సావంత్ చేతులుగా మీదుగా పాటిబండ్ల మోహన్ రావు అవార్డ్ అందుకున్నారు. తమ సొంత ప్రాంతంలో వైద్యం అందిస్తున్న తనను గుర్తించి అవార్డ్ కు ఎంపిక చేసిన ఫౌండేషన్ సభ్యులకు మోహన్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights