దేశ దిశ

Fortunate Pet: మీ ఇంట్లో ఈ జంతువులను పెంచుకుంటే.. మీ ఇంట అష్టైశ్వర్యాలు తాండవం చేస్తాయట!

Fortunate Pet: మీ ఇంట్లో ఈ జంతువులను పెంచుకుంటే.. మీ ఇంట అష్టైశ్వర్యాలు తాండవం చేస్తాయట!

ఈ భూమిపై మనుషులకు, జంతువులకు మధ్య ఒక రకమైన అనుబంధం ఉంది. ఈ కారణంగానే కుక్కలు, పిల్లులు, ఆవులు, కోళ్లు, గొర్రెలు వంటి తమకు నచ్చిన జంతువులను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మీరూ ఇంట్లో కుక్కలు, పిల్లులు, ఆవులను పెంచుకుంటారా? మీకు తెలుసా పెంపుడు జంతువులు కూడా కుటుంబంలో సభ్యులే. వాటి ఆహారం నుండి ఆరోగ్యం వరకు వాటిని బాగా చూసుకోవడం చాలా ముఖ్యం. పెంపుడు జంతువులను సంరక్షించాలంటే వాటిపై సరైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా కొన్ని రకాల జంతువులను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సుతో పాటు ధనలక్ష్మి కూడా ఆ ఇంట నాట్యం చేస్తుందని కొందరి నమ్మకం. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కుక్క

కుక్క మనిషికి ప్రాణ స్నేహితుడు అని అంటుంటారు. అందుకే చాలా మంది కుక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి కుక్కలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అవి ఇంటిని కాపాడతాయి. అంతేకాకుండా కుక్కను పెంచుకోవడం వల్ల జీవితంలోని అనేక సమస్యలను తగ్గించుకోవచ్చట. కుక్కలను పెంచుకోవడం వల్ల ఇంటిని సురక్షితంగా ఉంచడమే కాకుండా, ఈ కుక్కలు ఇంటి నుండి ప్రతికూల శక్తులను తొలగించడంలో కూడా సహాయపడతాయని చెబుతారు.

కుందేలు

ఇంట్లో అందమైన కుందేళ్ళను ఉంచుకోవడం కూడా ఆ ఇంటికి మంచిదట. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు క్షీణిస్తుంటే మీ ఇంట్లో ప్రతికూల శక్తి తిరుగుతున్నట్లు అర్ధం. ఇలాంటి వారు ఇంట్లో కుందేలును పెంచుకోవడం మంచిది. ఇది ఇంటి నుండి ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది. కుందేళ్ళను పెంచడం వల్ల ఇంటికి అదృష్టం వస్తుందని కూడా చాలా మంది నమకం.

ఆవు

హిందూ మతంలో ఆవులను గోమాతగా పూజిస్తారు. నేటికీ గ్రామాల్లో ఆవులను పెంచుతున్నారు. ఇంట్లో ఆవులను పెంచడం కూడా చాలా మంచిది. ఇది కుటుంబ సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.

గుర్రం

కుక్కలు, పిల్లుల మాదిరిగానే శక్తి, ప్రతిష్టకు చిహ్నంగా సంకేతంగా భావించే గుర్రాన్ని కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది ఆ ఇంటికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మంచి పెంపుడు జంతువు మాత్రమే కాదు.. మానసిక ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గుర్రానికి బాగా ఆహారం పెట్టడం, ప్రతిరోజూ కొద్దిసేపు బయట దానితో సమయం గడపడం వల్ల మీ మానసిక ఒత్తిడి, నిరాశ తగ్గుతాయి.

పిల్లి

చాలా మందికి పిల్లులు పెంచుకోవడం మహా ఇష్టం. మరొక కారణం ఏమిటంటే ఈ పిల్లులు ఎలుకలు, బొద్దింకలను పట్టుకుని చంపడం ద్వారా ఇంటిని సురక్షితంగా ఉంచుతాయి. అంతేకాకుండా శాస్త్రం ప్రకారం, ఇంట్లో పిల్లిని ఉంచుకోవడం శుభ సంకేతం. ఇవి మన మానసిక ఒత్తిడిని తగ్గించి ఇంటికి ఆనందాన్ని తెస్తాయి.

చేప

చాలా మంది ఇంట్లో అక్వేరియం ఉంచుకుంటారు. అందులో చాలా చేపలను ఉంచుతారు. చేపలు ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా శాస్త్రాలలో, చేపలను పెంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గ్రంథాల ప్రకారం చేపలు ఇంటికి శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తాయి.

మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Exit mobile version