దేశ దిశ

Former Minister Vidadala Rajini’s Brother-in-Regulation Arrested

Former Minister Vidadala Rajini’s Brother-in-Regulation Arrested

  • గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
  • గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
  • గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తరలింపు
  • స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్
Former Minister Vidadala Rajini’s Brother-in-Regulation Arrested

మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ అయ్యారు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.

READ MORE: Betting Apps: బెట్టింగ్ యాప్స్ కేసులపై కీలక నిర్ణయం.. కేసులన్ని సీఐడీకి బదిలీ

కాగా.. మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

READ MORE: SRH vs MI: ముంబై ఇండియన్స్ దూకుడు – వరుసగా నాలుగో విజయం

Exit mobile version