first image of suspected terrorists who have been concerned in pahalgam terror assault launched

Written by RAJU

Published on:

  • నలుగురు ఉగ్రవాదుల ఫొటో విడుదల
  • రైఫిల్స్‌తో పోజు
first image of suspected terrorists who have been concerned in pahalgam terror assault launched

పహల్గామ్‌ పర్యాటక ప్రాంతంలో మంగళవారం టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డ నరహంతకుల ఫొటోను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. తొలుత ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేశాక.. తాజాగా నలుగురు అనుమానితుల ఫొటోను తాజాగా భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ఫొటోలో ఏకే-47 రైఫిల్స్ పట్టుకుని ఫొటోలో పోజులిచ్చారు. వీరిలో ముగ్గురి పేర్లు సులేమాన్ షా, అబు తల్హా, ఆసిఫ్ ఫౌజీ అని అధికారులు వెల్లడించారు. అలాగే ఘటనాస్థలిలో ఏకే-47 తుపాకీ పట్టుకుని ఉన్న ఆ ఉగ్రవాది చిత్రం కూడా బయటకు వచ్చింది. పహల్గామ్ దాడి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా అగ్ర కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్‌గా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇతడు ఇస్లామాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాడని గుర్తించింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన వాడిగా కనిపెట్టారు. ఇక ఈ ఉగ్రవాదులకు స్థానిక ఇద్దరు స్థానికులు సహకరించినట్లుగా గుర్తించారు. ఇక ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ధరించినట్లుగా కనుగొన్నారు.

ఇక ఉగ్రదాడిలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. ఊహించని ముష్కరుల కర్కశత్వానికి తోటి భాగస్వాములను.. నవ వధువులు కోల్పోయి.. పుట్టెడు దు:ఖంలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచివేస్తోంది: పవన్‌ కల్యాణ్‌

ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌ పర్యటనలో ఉండగా ఈ ఘటన జరగడం విషాదకరం. నాలుగు రోజుల పర్యటన కోసం సోమవారం భారత్‌కు వచ్చారు. ఇంతలో ఈ ఘటన జరిగింది. ఇక పహల్గామ్ దాడి తర్వాత వాన్స్ కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృ‌తిక కార్యక్రమాలు రద్దు చేశారు. ఇక ఈ దాడికి జేడీ వాన్స్, ఉషా వాన్స్ తీవ్రంగా ఖండించారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడి.. ఆ సినిమా బ్యాన్..?

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. 5-7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఈ ఉగ్రవాదులంతా కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. మహిళలు, పిల్లల్ని ఏమి చేయలేదు. వారి జోలికి కూడా రాలేదు. ఒకవేళ అడ్డొచ్చినా.. ఏమీ చేయలేదు. ఇక ముస్లిమా? కాదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నాకే కాల్చారు. ఐడీ కార్డులో పేరు చూసి మరీ కాల్చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది మరణించారు. యూఏఈ, నేపాల్‌కు చెందిన ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: RSS General Secretary: టూరిస్టులపై ఉగ్రదాడి.. పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలి..!

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights