దేశ దిశ

ED Rides: హవాలా వ్యాపారులపై ఈడీ దాడుల కలకలం..


ABN
, Publish Date – Apr 24 , 2025 | 05:14 PM

హైదరాబాదులో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ED Rides: హవాలా వ్యాపారులపై ఈడీ దాడుల కలకలం..

ED Rides

ED Rides in Hyderabad: హైదరాబాదులో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో ఏకంగా 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, గతంలో కూడా దేశవ్యాప్తంగా హవాలా వ్యాపారులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, బెంగాల్, కోల్‌కతా లోను దాడులు చేశారు. తనిఖీల్లో భారీ మొత్తంలో హవాలా డబ్బుని గుర్తించారు.

అంతేకాకుండా, తెలంగాణ ఎన్నికల సమయంలోనూ హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ, కోటి, బషీరాబగ్ ప్రాంతాల్లో హవాలా సొమ్ము పట్టుబడ్డింది. హైదరాబాద్‌లో హవాలా ట్రాన్స్ఫార్మర్స్ టార్గెట్‌గా ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో హవాలా కేసులో పట్టుబడ్డ లిస్ట్‌తో ఈడీ సోదాలు చేపట్టింది.

Updated Date – Apr 24 , 2025 | 05:22 PM

Exit mobile version