దేశ దిశ

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

రంగారెడ్డి జిల్లా: భూదాన్ భూముల వ్యవహారంలో (Bhoodan land scam) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ (investigation) కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త (Businessman), రియాల్టర్ నుంచి 40 వింటేజ్ కార్లను (40 vintage cars) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వ్యాపారవేత్త తల్లి తన వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ భూదాన్ ల్యాండ్ దందా చేశారు. మునవార్ (Munawar) తల్లి తన వారసత్వ ల్యాండ్‌గా భూదాన్ భూములను చూపెట్టి వ్యాపారం చేశారు. నాగారంలో మునవార్ వందల ఎకరాల భూములను కబ్జా చేశారు. మనోహర్‌తో పాటు ఈడీ అధికారులు ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో భూదాన్ భూముల పత్రాలతో పాటు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మునవార్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో 40కు పైగా వింటేజ్ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్ల విలువే కోట్ల రూపాయలలో ఉంటుందని ఈడీ అధికారులు తేల్చారు. మునవార్ నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.

కాగా భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇక మహేశ్వరం ల్యాండ్‌ విషయంలోనూ తనిఖీలు చేపట్టారు. పాతబస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, అలాగే సర్ఫాన్, సుకుర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా‌లు భూదాన్ ల్యాండ్‌ను అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకం చేశారు. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్‌ను (IAS Officer Amay Kumar) ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

Also Read: పాకిస్తాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు…

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఇందులో సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు సమాచారం. ఈ 50 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో.. వారు ఇందులో ప్లాట్లుగా విభజించి.. ప్రస్తుతం అమ్మకాలు చేపట్టారు. అయితే ఈ అంశం ప్రస్తుతం కోర్టులో పరిధిలో ఉంది. దీంతో దర్మాసనం ఆ భూములకు సంబంధించి లావాదేవీలపై స్టే విధించింది. అయితే ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరిగిన తర్వాత ఆ రిపోర్టు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

భూదాన్ ల్యాండ్ వ్యవహారంలోనే గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమయ్ కుమార్‌‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి పలుమార్లు విచారించారు. అంతే కాకుండా అప్పటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి విచారించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ భూదాన్ భూముల వ్యవహారంపై ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే అందులో ఎవరెవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో వాటిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు విక్రయించారో, భూదాన్ భూములను కొనుగోలు చేసి వేరేవారికి విక్రయించిన వారిపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం పాతబస్తీలో సోదాలు జరుగుతున్నాయి. యాకత్‌పూర, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంఫై ఆదేశాలు ఇవ్వాలి..

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపదర్శనం..

For More AP News and Telugu News

Updated Date – Apr 30 , 2025 | 01:52 PM

Exit mobile version