దేశ దిశ

Duvvada: సస్పెండ్‌పై దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే..

Duvvada: సస్పెండ్‌పై దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే..

శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ (YSRCP) నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు (MLC Duvvada Srinivas reaction). ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేశారని దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు. ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని.. సస్పెన్షన్‌ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తానన్నారు. తటస్థుడిగా ఉంటూ తనను నమ్ముకున్న అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానన్నారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని దువ్వాడ శ్రీనివాస్ వ్యఖ్యానించారు.

Also Read..: ఆ శాఖను ఇష్టపూర్వకంగా ఎంచుకున్నా..

దువ్వాడ వ్యవహారంపై విమర్శలు..

కాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఆ పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్‌ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం మంగళవారం రాత్రి ప్రకటించన విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడంతోపాటు.. మరో మహిళ (మాధురి)తో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందిచిన వైసీపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది.

లోకేష్‌ను పొగడ్డమే కారణమా..

దువ్వాడ శ్రీనివాస్ స్థానిక వైసీపీ మహిళా నేతతో సహజీవనం, ఇన్‌స్టా రీల్స్‌, తిరుమల పర్యటనలో ఫొటోషూట్‌, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ… జగన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. అలాంటిది… ఉన్నట్టుండి ఆయనను ఎందుకు సస్పెండ్‌ చేశారనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి లోకేష్‌ను పొగడటమే దీనికి కారణమని తెలిసింది. ఒక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి పాల్గొన్నారు. ‘బాలయ్య తర్వాత స్వీటెస్ట్‌ పర్సన్‌ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు… ‘లోకేష్’ అని ఇద్దరూ ఏకకాలంలో సమాధానం ఇచ్చారు. లోకేష్ తెలివైనవాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడనీ కొనియాడారు. లోకేష్‌ను అంతగా పొడిగితే జగన్‌ ఊరుకుంటారా.. అందుకే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..

అరుదైన నక్షత్రపు తాబేలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..

ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి మద్దతు..

For More AP News and Telugu News

Updated Date – Apr 24 , 2025 | 01:46 PM

Exit mobile version