దేశ దిశ

CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు..ఎందుకంటే

CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు..ఎందుకంటే

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu) ఇవాళ(గురువారం) బిజీ బిజీగా ఉన్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వచ్చారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 11.30 నుంచి 1.30 గంటల వరకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ & మిషన్ లెర్నింగ్‌పై వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సాయంత్రం 06.15 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అయితే.. రేపు(శుక్రవారం) ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని సీఎం చంద్రబాబు కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవనున్నారు. మే 2వ తేదీన ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్న సమయంలో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ పర్యటనకు సంబంధించిన విషయాల గురించి సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మే2న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏపీకి మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేస్తారు. ఎల్లుండి(శనివారం) ఉదయం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నానికి చేరుకుంటారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

Minister Narayana: ప్రధాని ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ సూచనలు

ACB: మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..

Terror Attack: ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి.. మరికాసేపట్లో కావలికి మృతదేహం..

For More AP News and Telugu News

Exit mobile version