Viral Video: కదులుతున్న కారుపై స్టంట్ వేస్తే ఎంత పనైపాయెరా!… సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హాపూర్‌ పోలీసులు – Telugu News | Viral video man performs risky stunt on moving car in hapur viral act lands him in jail fined rs 30500 watch online

Viral Video: కదులుతున్న కారుపై స్టంట్ వేస్తే ఎంత పనైపాయెరా!… సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హాపూర్‌ పోలీసులు – Telugu News | Viral video man performs risky stunt on moving car in hapur viral act lands him in jail fined rs 30500 watch online

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావడానికి యువత ప్రమాదక స్టంట్స్‌ వేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరు జైళ్లో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి సంఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. హాపూర్ జిల్లాలో కదులుతున్న స్కార్పియో కారుపై ఒక వ్యక్తి ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్లిప్‌ను బాగ్‌పత్ (బాబు గర్) పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే హైవేపై చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సంఘటన వైరల్ అయిన తర్వాత … Read more

స్వదేశీ పత్తిరైతుపై పిడుగు

స్వదేశీ పత్తిరైతుపై పిడుగు

ఎగుమతులపై ట్రంప్‌ 50 శాతం సుంకాలువిదేశీ పత్తిపై టారిఫ్‌ రద్దుకేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకతఉపాధికి పెనుముప్పుకుదేలవుతున్న టెక్స్‌టైల్‌ రంగంన్యూఢిల్లీ : దేశంలో ‘తెల్ల బంగారం’గా పిలుస్తున్న పత్తి ఒకప్పుడు రైతన్న ఇంట సిరుల పంట పండించేది. భారతావనిలో అరవై లక్షల మంది రైతులకు జీవనాధారంగా, నాలుగున్నర కోట్ల మంది వస్త్ర పరిశ్రమ కార్మికుల పాలిట కల్పతరువుగా, దుస్తుల పరిశ్రమకు ఆలంబనగా నిలుస్తూ మన చేనేత వారసత్వాన్ని దశదిశలా వ్యాపింపజేసిన పత్తి ఇప్పుడు కేవలం ఓ సాధారణ … Read more

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి బీభత్సం..

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి బీభత్సం..

రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాలు అతలాకుతలంశిథిలాల కింద చిక్కుకున్న పలు కుటుంబాలుఉత్తరాఖండ్‌ను కుంభవృష్టి కుదిపేసింది. రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా, మరికొందరు గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి.చమోలీ జిల్లా దేవల్ ప్రాంతంలోని మోపటాలో జరిగిన ఘటనలో తారా సింగ్, ఆయన భార్య గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో విక్రమ్ సింగ్ దంపతులు గాయపడ్డారు. వారి పశువుల … Read more

బీహార్‌లోని ఓ పల్లె జనమంతా ఒకే ఇంట్లో? : రాహుల్ గాంధీ

బీహార్‌లోని ఓ పల్లె జనమంతా ఒకే ఇంట్లో? : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం మీద ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ముసాయిదా జాబితా గయా జిల్లాలోని ఓ గ్రామ ప్రజలంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొందన్నారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా బీహార్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఈ ఆరోపణ చేశారు. ఈసి మ్యాజిక్ కాకుంటే ఏమిటిది… పల్లె జనం అంతా ఒకే ఇంట్లో ఉండడం ఏమిటి? అని ఆయన నిలదీశారు. బారాచట్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గయాలోని నిదానీ గ్రామానికి చెందిన … Read more

Project Cheetah : నమీబియా చిరుతలు.. ఇండియాలో కొత్తగా ప్రవర్తిస్తున్నాయి

Project Cheetah : నమీబియా చిరుతలు.. ఇండియాలో కొత్తగా ప్రవర్తిస్తున్నాయి

Project Cheetah : రోమ్ లో ఉంటే రోమాన్ లా మారిపోవాలన్నది సామెత.. అనాదిగా మన భూమ్మీద ప్రకృతి వైపరీత్యాలు, కాలానుగుణంగా మనిషి, జంతువులు తమ అలవాట్లు మార్చుకున్నారు. బతకడం కోసం కొత్త విద్యలు నేర్చారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా జీవులు తమకు తాముగా మారిపోయాయి. అది భూమ్మీద జీవుల మనుగడకు ఎంతో తోడ్పాటునందించింది. నమీబియా నుంచి ఏరికోరి మన ప్రధాని నరేంద్రమోదీ తీసుకొచ్చిన చిరుతలు ఇప్పుడు ఇండియాలో మారిపోయాయి.. అవును వాటి ప్రవర్తనలో గణనీయమైన ఒక … Read more

Delhi: భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం.. విమానరాకపోకలకు అంతరాయం

Delhi: భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం.. విమానరాకపోకలకు అంతరాయం

శుక్రవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నోయిడా, ఘజియాబాద్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. దాంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.  ఢిల్లీలో, ఆగ్నేయ ఢిల్లీ, … Read more

ఇంత చిన్న విషయానికే అంత కఠిన నిర్ణయమా.. వంట చేయలేదన్నందుకు భార్య ఆత్మహత్య! – Telugu News | Uttar pradesh: woman suicide domestic dispute leads to tragic end in Kanpur police investigating

ఇంత చిన్న విషయానికే అంత కఠిన నిర్ణయమా.. వంట చేయలేదన్నందుకు భార్య ఆత్మహత్య! – Telugu News | Uttar pradesh: woman suicide domestic dispute leads to tragic end in Kanpur police investigating

ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాన్పూర్ జిల్లాలోని సౌత్ జోన్‌లోని సేన్ పశ్చిమ్ పారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. వాస్తవానికి, ఆ మహిళకు, ఆమె భర్తకు మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ మహిళ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న సేన్ పశ్చిమ్ పారా పోలీస్ స్టేషన్ పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకుని, ఆ మహిళ మృతదేహాన్ని … Read more

దొంగ‌లు అనుకొని స‌ర్వే అధికారుల‌ను కుమ్మేశారు..!

దొంగ‌లు అనుకొని స‌ర్వే అధికారుల‌ను కుమ్మేశారు..!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌పై గ్రామస్థులు దాడికి దిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో రాత్రివేళ కార్లలో వచ్చి దొంగతనాలు చేస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి, పరిచయం లేని వాహనాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు.. ఆగస్టు 28వ తేదీన గూగుల్ టీమ్‌ రోడ్డుపై మ్యాపింగ్ కోసం కెమెరా అమర్చిన వాహనంలో సర్వే చేస్తుండగా, అనుమానం … Read more

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌..

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌..

గ్రామాలను ముంచెత్తుతున్న వరదలుదేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల వద్ద కురుస్తున్న కుండపోత వర్షాలు పలు గ్రామాలను పూర్తిగా ముంచేస్తున్నాయి.రాష్ట్రంలో తాజాగా మరోసారి మేఘ విస్ఫోటం సంభవించడంతో పరిస్థితులు మరింత గందరగోళంగా మారాయి.ఈ విపత్తులో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు.మోపాటా ప్రాంతంలో భారీ వరదల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా.. అదేవిధంగా పశువుల … Read more

‘రామసేతు’పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

‘రామసేతు’పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

– Advertisement – ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ ఇదివరలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణచేపట్టింది. దీనిపై స్పందన తెలుపమని కోరతూ కేంద్రానికి నోటీసులు జారీచేసింది. రామసేతుకు సకాలంలో జాతీయ స్మారక హోదానివ్వాలని, జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలసికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలని గతంలో సుబ్రమణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ … Read more