బాంబేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీబీ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (యూసీడ్) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, గువాహటి, రూర్కీ, ఇండోర్.. ఐఐటీల్లో, ఐఐఐటీడీఎం (జబల్పూర్) సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌లలో బీడిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. యూసీడ్ స్కోర్ వ్యాలిడిటీ ఏడాది పాటు ఉంటుంది. విద్యార్ధులు వరసగా రెండుసార్లు మాత్రమే ఈ టెస్ట్ రాయడానికి వీలుంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో మొత్తం 245 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎవరైనా అక్టోబర్ 31, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్(యూసీడ్) 2026 కోర్సు సీట్ల వివరాలు ఇవే..
- ఐఐటీ బాంబే: 37 సీట్లు
- ఐఐటీ దిల్లీ: 20 సీట్లు
- ఐఐటీ గువాహటి: 56 సీట్లు
- ఐఐటీ హైదరాబాద్: 30 సీట్లు
- ఐఐటీ ఇందౌర్: 16 సీట్లు
- ఐఐటీ రూర్కీ: 20 సీట్లు
- ఐఐటీ జబల్‌పూర్: 66 సీట్లు
ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ గ్రూప్స్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. బైపీసీ సహా ఆర్ట్స్, కామర్స్ గ్రూప్‌లు చదివినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించే రెండేళ్ల జాయింట్ సర్వీసెస్ వింగ్ కోర్సు పూర్తిచేసినవారు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్‌ఐఓఎస్) నిర్వహించే సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అక్టోబర్ 1, 2001న లేదా ఆ తర్వాత జన్మించిన వారై ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 31, 2025.
- ఆలస్య రుసుంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 7, 2025.
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: జనవరి 2, 2026.
- రాత పరీక్ష తేదీ: జనవరి 18, 2026.
- ఫలితాల విడుదల తేదీ: మార్చి 6, 2026.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.