Dhana Yoga: ఈ రాశులకు ధన ధాన్య సమృద్ధి యోగం పక్కా.. ఇందులో మీ రాశి ఉందా? – Telugu News | Budha Shukra Conjunction in Cancer: Rare Dhana Yoga for these zodiac signs
కర్కాటకం: ఈ రాశిలో శుక్ర, బుధుల కలయిక వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం పూర్తి ఫలితాలనిస్తుంది. దేనికీ కొరత ఉండదు. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు, వ్యాపారాల్లో లాభాల వృద్ధికి అవకాశం ఉంది.