Astro Tips: తమ గమనాన్ని, రాశులను మార్చుకుంటున్న పలు గ్రహాలు.. ఏ రాశులకు ఎటువంటి ఫలితాలో తెలుసా.. – Telugu News | Planetary Transits in 2025: A Comprehensive Astrology check zodiac sign effects

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆగస్టు నెలలో అనేక గ్రహాల రాశి మార్పు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో చాలా ముఖ్యమైన గ్రహాలు తమ గమనాన్ని, రాశిలను మార్చుకుంటున్నాయి. ఈ గ్రహాల కదలిక, స్థితిలో పెద్ద మార్పును తెస్తుంది.. గ్రహ సంచారం ప్రపంచంలోని ప్రజలందరిమీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ మార్పులు మొత్తం 12 రాశులపై ప్రభావితం అవుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఆరోగ్యం, వృత్తి, సంపద, సంబంధాల వంటి జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఖగోళ సంఘటనవలన ఏ రాశికి ఎలాంటి మార్పు తెస్తుందో? ఏ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా రాబోయే కాలంలోని సవాళ్లను ఎదుర్కోవచ్చు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

సూర్య రాశి మార్పు
గ్రహాల రాజు సూర్య దేవుడు కర్కాటక రాశి నుంచి బయలుదేరి ఆగస్టు 17న తన సొంత రాశి సింహంలోకి ప్రవేశించాడు. ఈ సూర్య సంచారము ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యం , ప్రభుత్వ పనిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సింహరాశిలో సూర్యుడు ఉండటం ఒక వ్యక్తి సంకల్ప శక్తిని బలపరుస్తుంది. లక్ష్యాలను సాధించేలా ప్రేరేపిస్తుంది.

బుధ గ్రహ సంచారము
ఆగస్టు చివరిలో తెలివితేటలు, సంభాషణలను సూచించే గ్రహం అయిన బుధుడు కూడా రాశిని మార్చుకోనున్నాడు. ఆగస్టు 30న బుధుడు కర్కాటక రాశి నుంచి బయలుదేరి సూర్యుని రాశి సింహంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారము కమ్యూనికేషన్, తెలివితేటలు, వ్యాపారం, విద్య వంటి రంగాలను ప్రభావితం చేస్తుంది. బుధుడు సూర్యుని రాశిలోకి ప్రవేశించినప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశిల కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. కెరీర్ పురోగతికి దారితీస్తుంది. సింహరాశిలో సూర్యుడు, బుధుడుతో పాటు కేతువు ఉండటం కూడా త్రిగ్రహ యోగం కలయికను సృష్టిస్తుంది.

ఇవి కూడా చదవండి

శుక్ర సంచారము
ప్రేమ, అందం, సంపద, సౌకర్యాన్ని సూచించే గ్రహం అయిన శుక్రుడు ఆగస్టు 21న మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళతాడు. శుక్రుని రాశిలో ఈ మార్పు సంబంధాలు, వైవాహిక జీవితం, ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇది కళ, సంగీతం, సృజనాత్మక రంగాలలో కూడా కొత్త శక్తిని తీసుకురాగలదు. ఒక వ్యక్తి సామాజిక జీవితం, ప్రేమ సంబంధాలలో కూడా మార్పులను చూడవచ్చు.

కుజ గ్రహం స్థానం, దాని ప్రభావం
శక్తి, ధైర్యం, శౌర్యం, భూమిని సూచించే గ్రహం అయిన కుజుడు జూలై 28, 2025 నుండి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 13న చంద్రుని హస్త నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ కుజుడు సంచారము ఒక వ్యక్తి కోపం, ఉత్సాహం, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది శారీరక శక్తిని , పోటీ స్ఫూర్తిని కూడా పెంచుతుంది. కుజుడి ప్రభావం ఆస్తి విషయాలలో, వివాదాలలో కూడా మార్పులను తీసుకురాగలదు.

ఏ రాశిపై ప్రభావం చుపిస్తుందంటే
ఆగస్టులో జరిగే ఈ గొప్ప గ్రహ మార్పుల ప్రభావం అన్ని రాశిచక్రాలపై భిన్నంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సంచారము ప్రతి రాశివారికి కొన్ని కొత్త అవకాశాలను, కొన్ని సవాళ్లను తెస్తుంది.

మేషరాశి
ఈ సమయం మేష రాశి వారికి చాలా మంచిది. సానుకూలంగా ఉంటుంది. ఇది ఆత్మవిశ్వాసం , సృజనాత్మకతను పెంచుతుంది. సింహరాశిలో సూర్యుని సంచారం వీరి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మరింత సామాజికంగా చురుకుగా ఉంటారు. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి, ఈ కాలం కుటుంబం, గృహ ఆనందం, శాంతిపై దృష్టి పెట్టవాల్సి ఉంటుంది. సంబంధాలు మధురంగా మారతాయి. అయితే ప్రేమ సంబంధాలలో జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇది నాయకత్వం వహించడానికి మంచి సమయం. ఆరోగ్యం, ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.

మిథున రాశి:
మిథున రాశి వారికి కమ్యూనికేషన్ ,ప్రయాణం ముఖ్యమైనవి కావచ్చు. బుధ సంచారము వీరి కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుతుంది. ఇది వ్యాపారం, సామాజిక సంబంధాలలో ప్రయోజనం చేకూరుస్తుంది. చిన్న ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. వ్యాపారం బాగా నడుస్తుంది. ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి డబ్బు, కుటుంబ విషయాలలో ముఖ్యమైనది. సూర్యుని సంచారము ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఆర్థిక లాభాలు, గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కొనసాగించాలి.

సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయం వ్యక్తిగత వృద్ధికి, స్వీయ-గుర్తింపుకు ముఖ్యమైనది. సొంత రాశిలో సూర్యుని ప్రవేశం వీరికి శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. పదోన్నతి, ప్రతిష్ట పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం.

కన్య రాశి
కన్య రాశి వారికి ఈ సమయంలో అధిక ఖర్చులు చేయాల్సి ఉంటుంది. వాదనలకు దూరంగా ఉండడం మేలు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు ఏర్పడవచ్చు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఆఫీసులో పురోగతికి అవకాశాలు లభిస్తాయి. అయితే మాట్లాడే విధానంలో జాగ్రత్తలు తీసుకోండి. అధికారులు లేదా బాస్‌తో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.

తులా రాశి
తులారాశి వారికి ఈ నెల ఆదాయం, సామాజిక సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రుని సంచారము వీరి సామాజిక ప్రతిష్టను పెంచుతుంది. కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కలుగుతాయి. ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కెరీర్, ప్రజా జీవితంలో గణనీయమైన మార్పులు రావచ్చు. ఆఫీసులో, వ్యాపారంలో వాతావరణం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో పురోగతికి, వ్యాపారంలో లాభానికి అవకాశాలు ఉంటాయి. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. పెళ్లికాని వారి వివాహం కుదిరే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉన్నత విద్య, అదృష్టానికి శుభప్రదంగా ఉంటుంది. సూర్యుని సంచారము వీరి అదృష్టాన్ని బలపరుస్తుంది. ఇది కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విద్యా పని ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది. పరిశోధన పనుల కోసం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు.

మకర రాశి
మకర రాశి వారికి కొన్ని సవాళ్లతో పాటు అవకాశాలను కూడా తెస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ఖర్చులకు సిద్ధంగా ఉండండి. అయితే చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంటుంది.

కుంభ రాశి
కుంభ రాశి వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక విజయాలను సాధిస్తారు. అయితే కొన్ని అపార్థాలను నివారించడానికి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం.

మీన రాశి
మీన రాశి వారికి ఆరోగ్యం, అప్పులు మరియు శత్రువులకు సంబంధించినది కావచ్చు. శుక్ర సంచారము ప్రేమతో నిండి ఉంటుంది. ఆఫీసులో విజయం సాధించవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఒత్తిడి స్థాయి తక్కువగా ఉంటుంది. అయితే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Leave a Comment