యూఎస్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన చైనా

యూఎస్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన చైనా

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: లాటిన్ అమెరికా, కరేబియన్‌లలో చైనా “వనరులను చొరబడి దోచుకుంటోంది” అని యుఎస్ సదరన్ కమాండ్ అధిపతి చేసిన ఆరోపణలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఖండించారు. యుఎస్ ఆరోపణలు నిరాధారమైనవని, కాలం చెల్లిన వాక్చాతుర్యమని పేర్కొన్నారు. ఆయా ప్రాంతంలోని దేశాల సార్వభౌమాధికారం, నిర్ణయాలను గౌరవించాలని చైనా ప్రతినిధి గువో జియాకున్ అమెరికాను కోరారు. కొంతమంది యుఎస్ అధికారులు ఇప్పటికీ సంఘర్షణలో పాతుకుపోయిన కోల్డ్ వార్ మనస్తత్వాన్ని పట్టుకున్నారని విమర్శించారు. యుఎస్ ఆధిపత్య … Read more

అమల్లోకి 50శాతం టారిఫ్‌లు

అమల్లోకి 50శాతం టారిఫ్‌లు

– భారత పరిశ్రమలకు గడ్డుకాలమే– యూఎస్‌తో చర్చల్లో మోడీ విఫలం – తీవ్ర ఆందోళనలో ఎగుమతిదారులున్యూఢిల్లీ : భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు అమల్లో ఉండగా.. ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం అదనపు సుంకాలను మోపింది. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి అదనంగా 25 శాతం టారీఫ్‌లు విధిస్తూ.. ఆగస్టు 6న ఈ ఎగ్జిక్యూటీవ్‌ ఆర్డర్‌ 14329పై ట్రంప్‌ … Read more

ఆకలికి మరో ముగ్గురు బలి

ఆకలికి మరో ముగ్గురు బలి

– Advertisement – – ఆహారం కోసం వెళ్ళిన 17మందితో సహా 75మంది మృతి– జర్నలిస్టుల మృతిని ఖండించిన ప్రపంచ దేశాలు – జెరూసలేంలో నిరసనలుగాజా, జెరూసలేం : గాజాలో సోమవారం నాజర్‌ ఆస్పత్రి లక్ష్యంగా జరిగిన దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు మృతి చెందడంపై ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఇజ్రాయిల్‌ వైఖరిని ఖండించాయి. పాశవికమైన యుద్ధ నేరం ఇదని ఇరాన్‌, కెనడా, ఈజిప్ట్‌, సౌదీ అరేబియా సహా పలు దేశాలు తీవ్రంగా విమర్శించాయి. కాగా, గత … Read more

ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగించబోం : ఆస్ట్రేలియా

ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగించబోం : ఆస్ట్రేలియా

– Advertisement – మెల్‌బోర్న్‌ : ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగించబోమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ మంగళవారం ప్రకటించారు. ఇరాన్‌ రాయబారిని తమ దేశం నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌లో ఉన్న ఆస్ట్రేలియా దౌత్యవేత్తలను కూడా వెనక్కి రప్పించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో రెండు యూదు వ్యతిరేక దాడులకు ఇరాన్‌ నేతృత్వం వహించిందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ ఆరోపించారు. సిడ్నీ రెస్టారెంట్‌, మెల్‌బోర్న్‌ యూదుల ప్రార్థనా మందిరంపై జరిగిన దాడులకు ఇరాన్‌తో సంబంధం కలిగిఉందని నిఘా సంస్థ … Read more

శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘెకు బెయిల్‌

శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘెకు బెయిల్‌

– Advertisement – కొలంబో : శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణీల్‌ విక్రమసింఘెకు మంగళవారం బెయిల్‌ మంజూరైంది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రమ సింఘెను ఈ నెల 22న అరెస్టు చేశారు. కాగా ఆయన ఆనారోగ్య పరిస్థితులను దృష్టిలో వుంచుకుని మంగళవారం కొలంబో ఫోర్ట్‌ మేజిస్ట్రేట్‌ బెయిల్‌ ఉత్తర్వులను జారీ చేసింది. గత శుక్రవారం ఆయనను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న వెంటనే జైలు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొలంబో నేషనల్‌ … Read more

చైనాను నాశనం చేసే పాచికలున్నాయి

చైనాను నాశనం చేసే పాచికలున్నాయి

– Advertisement – – కానీ బీజింగ్‌ను అస్థిరపరచను– ట్రంప్‌ బీరాలువాషింగ్టన్‌ : తమ వద్ద చైనాను నాశనం చేయగల అనూహ్యమైన, అద్భుతమైన వ్యూహాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. బీజింగ్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలో వాషింగ్టన్‌ శక్తి సామర్ధ్యాలను ఆయన ఏకరువు పెట్టారు. ‘వారి వద్ద కొన్ని వ్యూహాలు ఉన్నాయి. కానీ మా వద్ద అనూహ్యమైన వ్యూహలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియుంగ్‌తో సోమవారం సమావేశం … Read more

అమెరికాకు 25 దేశాల పోస్టల్‌ సర్వీసులు నిలిపివేత

అమెరికాకు 25 దేశాల పోస్టల్‌ సర్వీసులు నిలిపివేత

– Advertisement – న్యూయార్క్‌: ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాపై ఆయా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను ట్రంప్‌ యంత్రాంగం ఉపసంహరించుకున్న నేపథ్యంలో అమెరికాకు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇలా ఇప్పటివరకు భారత్‌ సహా 25 దేశాలు పోస్టల్‌ సర్వీసులను నిలిపివేసినట్టు ఐరాసలోని యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ వెల్లడించింది. ఐరాస సభ్య దేశాలకు సంబంధించి పోస్టల్‌ సేవల మధ్య సహకారం కోసం ఏర్పాటైన యూనివర్సల్‌ … Read more

అమెరికా ఆంక్షలతో అడియాసలైన ట్రక్‌ డ్రైవర్ల ఆశలు

అమెరికా ఆంక్షలతో అడియాసలైన ట్రక్‌ డ్రైవర్ల ఆశలు

– Advertisement – న్యూఢిల్లీ : విదేశీ ట్రక్‌ డ్రైవర్లకు వర్క్‌ వీసాలు, వాణిజ్య డ్రైవింగ్‌ లైసెన్సుల (సీడీఎల్‌) జారీని అమెరికా నిషేధించడంతో మన దేశంలో వేలాది యువకుల ఆశలు, ఆకాంక్షలకు విఘాతం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలోని ట్రక్‌ డ్రైవర్లకు అమెరికా నిషేధం శరాఘాతమే. ఎందుకంటే అమెరికాలో ట్రక్కులు నడుపుతూ ఆదాయాన్ని పెంచుకోవాలని, గౌరవాన్ని పొందాలని వారు భావిస్తారు. అమెరికా ట్రక్‌ పరిశ్రమ ఎంతోమంది విదేశీయులను ఆకర్షిస్తోంది. అక్కడ జీతాలు ఎక్కువగా … Read more

29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్‌, చైనాల్లో మోడీ పర్యటన

29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్‌, చైనాల్లో మోడీ పర్యటన

– Advertisement – న్యూఢిల్లీ : ఈ నెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్‌, చైనాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ముందుగా ఈ నెల 29, 30 తేదీల్లో జపాన్‌లో మోడీ పర్యటిస్తారు. అక్కడ 15వ భారత్‌-జపాన్‌ వార్షిక సమావేశంలో మోడీ పాల్గొంటారు. జపాన్‌ ప్రధాని షిగెరు ఐషిబాతో సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని మోడీకి ఇది ఎనిమిదో జపాన్‌ పర్యటన. ఈ పర్యటనలో జపాన్‌తో రక్షణ, భద్రత, వాణిజ్య, ఆర్ధిక, సాంకేతిక, … Read more

త్వరలో కిమ్‌తో ట్రంప్‌ భేటీ!

త్వరలో కిమ్‌తో ట్రంప్‌ భేటీ!

వాషింగ్టన్‌/సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో ఈ ఏడాది భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు. దక్షిణ కొరియాతో వాణిజ్య చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ అమెరికాలో పర్యటించారు. శ్వేతసౌధ్యంలో ట్రంప్‌ ఆయనకు స్వాగతం పలికారు. ఇద్దరు అధినేతలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఓవల్‌ కార్యాలయంలో విలేకరులతో సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ ‘సమీప … Read more