శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘెకు బెయిల్‌

– Advertisement –

కొలంబో : శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణీల్‌ విక్రమసింఘెకు మంగళవారం బెయిల్‌ మంజూరైంది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రమ సింఘెను ఈ నెల 22న అరెస్టు చేశారు. కాగా ఆయన ఆనారోగ్య పరిస్థితులను దృష్టిలో వుంచుకుని మంగళవారం కొలంబో ఫోర్ట్‌ మేజిస్ట్రేట్‌ బెయిల్‌ ఉత్తర్వులను జారీ చేసింది. గత శుక్రవారం ఆయనను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న వెంటనే జైలు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొలంబో నేషనల్‌ ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు మార్చారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధితో ఆయన బాధపడుతున్నారని, పూర్తిగా పర్యవేక్షణ అవసరమని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఐసియు నుండి జూమ్‌ ద్వారా ఆయన కోర్టు విచారణలో పాల్గొన్నారు. అవినీతిపై నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్టు కావడం ఇదే తొలిసారి.

– Advertisement –

Leave a Comment