దేశ దిశ

AP Inter Consequence Date and Time 2025: ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే – Telugu Information | AP Inter Outcomes 2025 date and time: Andhra Pradesh Intermediate 1st and 2nd 12 months Consequence to be declared on April 12 at 11 AM

AP Inter Consequence Date and Time 2025: ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే – Telugu Information | AP Inter Outcomes 2025 date and time: Andhra Pradesh Intermediate 1st and 2nd 12 months Consequence to be declared on April 12 at 11 AM

అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ వార్షిక పరీక్షలు మార్చి 20వ తేదీలో ముగిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడాని విద్యార్ధులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 10 లక్షల విద్యార్ధుల జావాబు పత్రాల మూల్యాంకనం కూడా తాజాగా ముగిసింది. విద్యార్ధుల మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ కూడా చకచకా పూర్తి చేసిన ఇంటర్ బోర్డు ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో విద్యాశాఖ శుక్రవారం (ఏప్రిల్ 11) కీలక ప్రకటన జారీ చేసింది. అనూహ్యంగా శనివారమే (ఏప్రిల్ 12) ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫలితాలను ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ల ద్వారా నేరుగా చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ బోర్డు ఫలితాలను https://results.eenadupratibha.net/, https://resultsbie.ap.gov.in లింక్‌ల ద్వారా నేరుగా చెక్‌ చేసుకోండి.

అలాగే మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 95523 00009కు హాయ్‌ అని మెసేజ్‌ పంపి చిటికెలో విద్యార్ధులు తమ ఫలితాలను చెక్‌ చూసుకోవచ్చు. కాగా గతేడాది కూడా సరిగ్గా ఏప్రిల్ 12వ తేదీనే ఇంటర్‌ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఈసారి కూడా అదే తేదీన ఫలితాలు ప్రకటించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

అగ్నివీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలకు సంబంధించి అగ్నివీర్‌ నియామకాల దరఖాస్తును ఏప్రిల్‌ 25 వరకు పొడిగించినట్లు గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్‌ కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు సహా 13 వేర్వేరు భాషల్లో ఆన్‌లైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ (సీఈఈ) పరీక్ష ఈ ఏడాది జూన్‌లో నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గుంటూరు, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఎవరైనా తమకు ఆసక్తి ఉంటే అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, అగ్నివీర్‌ క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అగ్నివీర్ పోస్టుల నియామకాలకు సంబంధించి దళారీలు, మోసగాళ్ల బారినపడకుండా అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Exit mobile version