దేశ దిశ

Andhra: కియాలో 900 కారు ఇంజిన్‌ల చోరీ కేసులో పురోగతి.. 9 మంది అరెస్ట్ – Telugu Information | Andhra Pradesh: 9 Arrested in 900 Automotive Engines Lacking Case from KIA Motors Manufacturing Facility

Andhra: కియాలో 900 కారు ఇంజిన్‌ల చోరీ కేసులో పురోగతి.. 9 మంది అరెస్ట్ – Telugu Information | Andhra Pradesh: 9 Arrested in 900 Automotive Engines Lacking Case from KIA Motors Manufacturing Facility

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. దీనిపై కియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుంది. అన్ని కోణాల్లో విచారిస్తున్న సిట్ బృందం.. తమిళనాడులో 9మందిని అరెస్ట్ చేసింది. వారు సంస్థలో పనిచేస్తున్నవారా..? మాజీ ఉద్యోగులా లేదా బయటివారా అన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

కియా కార్ల ఇంజిన్లు విదేశాల నుంచి చెన్నై పోర్టుకు చేరుకుంటాయి. పోర్ట్ నుంచి కంటైనర్ల ద్వారా ఏపీలోని కియా పరిశ్రమకు చేరుకుంటాయి. దారి మధ్యలో మాయం చేశారా?. ఇన్వాయిస్‌లో తేడాలు చూపి.. పోర్టు నుంచి ఇంజిన్లు తప్పించారా అన్న అంశాలపై కూడా క్లారిటీ రావాలి.

పెనుకొండ మండలం యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా కార్ల పరిశ్రమలో సుమారు 900 ఇంజిన్లు మాయమయ్యాయి. అవి గుట్టుచప్పుడు కాకుండా కాంపౌండ్‌ దాటాయో, అసలు లోపలిదాకా రాకుండా మధ్యలోనే మాయమయ్యాయో అంతుపట్టటంలేదు. కియాలో జరిగిన ఈ భారీచోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజిన్లు కనిపించడం లేదంటూ మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది కియా యాజమాన్యం. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేశాకే ఎంక్వయిరీ స్టార్ట్‌చేశారు పోలీసులు.

కియాలో ఇంజిన్ల చోరీపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో దార్లోనే చోరీ జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  వేలకార్లు తయారయ్యే పరిశ్రమలో ఏకంగా 900 ఇంజిన్లు లెక్కతేలకపోవటంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చింది కంపెనీ యాజమాన్యం. తొలుత ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని యాజమాన్యం కోరినా.. కంప్లయింట్‌ ఇస్తేనే ఎంక్వయిరీ చేస్తామని పోలీసులు చెప్పేశారు. కియా ప్రతినిధులు ఫిర్యాదు చేశాక విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ చోరీ వెనుక గతంలో కియాలో పనిచేసిన ఉద్యోగుల హస్తం ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కార్ల ఇంజిన్‌లు కంటైనర్లలో కియా పరిశ్రమకు వస్తాయి. దీంతో దార్లోనే వాటిని దారి మళ్లించారా లేకపోతే ఇంటిదొంగలు కూడబలుక్కుని ఇండస్ట్రీ నుంచే లిఫ్ట్‌ చేశారా అనే కోణంలో పోలీసులు ఎంక్వయిరీ స్టార్ట్‌ చేశారు. కియా కార్ల ఫ్యాక్టరీలో 900 ఇంజిన్లనేది చాలా పెద్ద వ్యవహారం. అంత భారీసంఖ్యలో ఇంజిన్లను ఎవరూ గుర్తించకుండా తరలించడం.. ఇంటిదొంగల సహకారం లేకుండా సాధ్యం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కియా వంటి అంతర్జాతీయ కంపెనీల్లో ఆటోమేటెడ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ ఉంటుంది. అలాంటిది అందరి కళ్లుగప్పీ ఇంత పెద్ద చోరీ జరిగిందంటే.. మాజీ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, ట్రాన్స్‌పోర్టర్స్‌ ప్రమేయం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి.

కియా పరిశ్రమకు విడి భాగాలు ఒక్కో చోటు నుంచి వస్తుంటాయి. కారు ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. పరిశ్రమ నుంచి ఒకేసారి 900 ఇంజిన్లను ఎత్తుకెళ్లారా? లేదంటే కొన్ని నెలలుగా విడతలవారీగా తరలించారా అన్న యాంగిల్‌లోనూ సాగుతోంది పోలీసు ఎంక్వయిరీ. కియా ప్లాంట్‌లోకి బయటి వ్యక్తుల ఎంట్రీ సాధ్యంకాదు. కియా యాజమాన్యం అనుమతి లేకుండా గేటుదాటి బయటికి చిన్న రేకు ముక్క కూడా వెళ్లలేదు. అందుకే ఇంటి దొంగల ప్రమేయం లేకుండా ఇంత భారీ చోరీ సాధ్యంకాదని భావిస్తున్నారు. ఇదేదో రాత్రికి రాత్రి జరిగే ఆస్కారమే లేదు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పాటైన తొలి భారీ పరిశ్రమగా కియాకు గుర్తింపు ఉంది. 2019 జూన్‌లో పెనుకొండ ప్లాంట్‌నుంచి మొదటికారు మార్కెట్‌లోకి విడుదలైంది. అంతర్జాతీయ కార్ల పరిశ్రమలో ఇంత భారీగా ఇంజిన్లు మాయంకావడమే విచిత్రమైతే.. వాటిని ఎక్కడికి తరలించి ఎలా సొమ్ముచేసుకుని ఉంటారనేది మరో అంతుపట్టని రహస్యం. తాజాగా ఈ కేసులో 9 మంది అరెస్ట్ కావడంతో.. త్వరలో చిక్కుముడి వీడే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version