Operation Sindoor: షోయబ్ మాలిక్ స్వగ్రామంపైనా భారత్ దాడి.. కారణం ఏంటంటే?

Written by RAJU

Published on:


Shoaib Malik Home Town Sialkot: పాకిస్తాన్ క్రికెట్‌లో షోయబ్ మాలిక్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. పాకిస్తాన్ మొత్తంలో అతని కంటే భారీ టీ20 రికార్డులు కలిగిన బ్యాట్స్‌మన్ మరొకరు లేరు. కానీ, భారత వైమానిక దళం పాకిస్తాన్, పీఓకేపై వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, షోయబ్ మాలిక్ ఊరిలోనూ దాడి జరిగింది. మే 7న నిర్వహించిన వైమానిక దాడిలో, భారత వైమానిక దళం పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. వీటిలో బహవల్‌పూర్, మురిద్కే, గుల్పూర్, భీంబర్, చక్ అమ్రు, బాగ్, కోట్లి, సియాల్‌కోట్, ముజఫరాబాద్ పేర్లు ఉన్నాయి. ఈ 9 ప్రదేశాలలో, షోయబ్ మాలిక్ ఇల్లు సియాల్‌కోట్‌లో ఉంది.

సియాల్‌కోట్‌లో షోయబ్ మాలిక్ పూర్వీకుల ఇల్లు..

పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ 1982లో సియాల్‌కోట్‌లోని పంజాబీ రాజ్‌పుత్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మాలిక్ ఫకీర్ హుస్సేన్ అక్కడ ఒక చిన్న షూ దుకాణం నడిపేవాడు. అదే దుకాణం నుంచి వచ్చిన సంపాదనతో, తండ్రి క్రికెటర్ కావాలనే తన కొడుకు కలను నెరవేర్చాడు. 2006లో, షోయబ్ మాలిక్ తండ్రి క్యాన్సర్‌తో మరణించాడు. అతను పాకిస్తాన్ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతులు సంపాదించి జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. దీంతో అతను సియాల్‌కోట్‌ను వదిలి కరాచీలో స్థిరపడ్డాడు.

సియాల్‌కోట్‌పై వైమానిక దాడికి కారణం..

అయితే, షోయబ్ మాలిక్ ఎక్కడ స్థిరపడినా, అతని పూర్వీకుల ఇల్లు సియాల్‌కోట్‌లోనే ఉంటుంది. ప్రస్తుతానికి, సియాల్‌కోట్ వార్తల్లోకి వచ్చింది. షోయబ్ మాలిక్ వల్ల కాదు, భారత వైమానిక దాడుల వల్ల. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భారత వైమానిక దళం సియాల్‌కోట్‌పై ఎందుకు దాడి చేసింది?

ఇవి కూడా చదవండి

పహల్గామ్ ప్రతీకారం..

ముందుగా, పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారతదేశం 9 చోట్ల ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో, విహారయాత్రకు వెళ్లిన 28 మంది అమాయకులను ఉగ్రవాదులు చంపారు. ఆ దారుణ సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత భారతదేశం స్పందించింది. దీంతో పహల్గామ్ కోసం ప్రతీకారం తీర్చుకున్నాడు.

సియాల్‌కోట్‌పై దాడికి ఇదే కారణం..

సియాల్‌కోట్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా కేంద్రం ఉందని భారతదేశానికి నిఘా వర్గాల ద్వారా తెలిసిందని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు లోపల 12 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహమూనా శిక్షణా కేంద్రం వార్తల్లో తక్కువగా కనిపించింది. కానీ, ఇది చాలా ప్రాణాంతకమైనది. ఇక్కడ స్థానిక కాశ్మీరీలను నియమించి శిక్షణ ఇచ్చేవారు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో ఉగ్రవాద కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరిగాయి. పఠాన్‌కోట్ దాడి కుట్ర కూడా ఇక్కడి నుంచే జరిగింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights