
Telangana: అక్టోబర్ 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బంద్ ఉండనున్నాయి. బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహణకు మద్దతుగా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్‌లలో భాగంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు పార్టీ కార్యకర్తలు, అనుచరులు బంద్‌లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18వ తేదీ శనివారం వస్తోంది. తర్వాత 19న ఆదివారం, ఆ తర్వాత 20వ తేదీ దీపావళి ఇలా మొత్తం తెలంగాణలో మూడు రోజుల పాటు వరుసగా సెలవులు ఉండనున్నాయి. ఈ వారం విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, బీసీ సంఘాలు తమ రిజర్వేషన్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు అక్టోబర్ 14న బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కానీ వివిధ కారణాలతో ఈ బంద్ ను 18వ తేదీకి వాయిదా వేశాయి.
76 ఏళ్లుగా అన్యాయం:
గత 76 ఏళ్లుగా తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు అయినప్పటికీ.. బీసీలు ఇంకా తమకు దక్కాల్సిన న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి పూర్తిగా దక్కడం లేదని, బీసీల జనాభాకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి