తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతుంది. ఈ రోజు నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అలాలే ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోనికి ప్రవేశించనున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణ లోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇవాళ వర్షాలు కురిసే జిల్లాలు
నైరుతి రుతుపవనాల తిరుగమనం ప్రభావంతో ఇవాళ తెలంగానలోని నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. అలాగే మరి కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది
శుక్రవారం వర్షాలు కురిసే జిల్లాలు
నైరుతి రుతుపవనాల తిరుగమనం ప్రభావంతో శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
మరోవైపు తెలంగాణలో పాటు అటు ఏపీలోనూ పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనుండగా అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-45కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.