Site icon Desha Disha

PM Modi’s Kurnool visit Live Updates: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. శ్రీశైల క్షేత్రం సందర్శన – Telugu News | PM Modi’s Kurnool visit Live Updates, Launches developmental projects worth Rs 13,430 crore

PM Modi’s Kurnool visit Live Updates: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. శ్రీశైల క్షేత్రం సందర్శన – Telugu News | PM Modi’s Kurnool visit Live Updates, Launches developmental projects worth Rs 13,430 crore

PM Modi’s Kurnool visit Live Updates: ఇవాళ ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత కర్నూలు నిర్వహించే రోడ్‌షో, సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధాని మోదీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాసేపట్లో ఢిల్లీ నుంచి బయల్దేరనున్న మోదీ… 9.50 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎంఐ-17 హెలికాప్టర్‌లో బయల్దేరి 10.55 గంటలకు శ్రీశైలం చేరుకుని, 11.15 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు బయల్దేరి వెళ్లి శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారు. అనంతరం 12.40 గంటలకు భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు. అక్కడే విశ్రాంతి తీసుకుని 1.40 గంటలకు సున్నిపెంట నుంచి కర్నూలుకు హెలికాప్టర్‌లో వెళ్తారు.

ఇక మధ్యాహ్నం 2:30 గంటలకు కర్నూలులోని పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 13వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవని సంబంధించినవని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలతో కలిసి సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక సాయంత్రం 4:45కు కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Exit mobile version