Site icon Desha Disha

PM Modi and Chandrababu: చంద్రబాబు అడగ్గానే మోడీ చేశారట! తెరవెనుక జరిగిందిదీ

PM Modi and Chandrababu: చంద్రబాబు అడగ్గానే మోడీ చేశారట! తెరవెనుక జరిగిందిదీ

PM Modi and Chandrababu: విశాఖలో గూగుల్ డేటా సెంటర్( Google data centre) ఏర్పాటు కానుంది. ఇది ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలవనుంది. అయితే ఈ డేటా సెంటర్ అంత సులువుగా రాలేదు. అది రావడానికి మాత్రం ఇద్దరి కృషి ఉంది. వారే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. దాదాపు 87 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. అయితే ఆ సంస్థను ఒప్పించడం.. కొన్ని రకాల మినహాయింపులు ఇప్పించడం వెనుక తండ్రి కొడుకుల పాత్ర అమోఘం. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ బయటపెట్టారు. దీని వెనుక జరిగిన కృషిని వివరించారు.

గత ఏడాది డిసెంబర్ లోనే..
వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లోనే గూగుల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు నారా లోకేష్( Nara Lokesh ). అప్పట్లోనే గూగుల్ ముందుకు వచ్చింది. అయితే డేటా సెంటర్ ఏర్పాటుకు కొన్ని రకాల మినహాయింపులు అడిగింది. అయితే సాధారణంగా డేటా సెంటర్ కు సంబంధించిన పాలసీలను కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి మినహాయింపులు ఇచ్చే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ సీఎం చంద్రబాబుతో చర్చించారు. దీంతో సీఎం చంద్రబాబు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. డేటా సెంటర్ పాలసీని మార్చితేనే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వెంటనే ఆయన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవి కు కీలక సూచనలు చేశారు. లోకేష్ సైతం ప్రత్యేకంగా కేంద్రమంత్రి తో సమావేశం అయ్యారు. గూగుల్ డేటా సెంటర్కు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. డేటా సెంటర్ పాలసీలో మార్పులు తెస్తే కొన్ని రకాల మినహాయింపులు ఇవ్వవచ్చని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మినహాయింపులు వచ్చాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇదే విషయం లోకేష్ చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.

ఉమ్మడి ఏపీలో సైతం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చంద్రబాబు( CM Chandrababu) ఉన్న సమయంలోనే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అప్పట్లో ఐటి అభివృద్ధికి బీజం వేశారు చంద్రబాబు. ఆ సమయంలో కూడా కొన్ని రకాల మినహాయింపులు వచ్చేవి కేంద్రం నుంచి. కానీ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నారు. కానీ వాజ్పేయి హయాంలో ఉన్నంత స్వేచ్ఛ రాలేదు. అయితే ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఆపై కేంద్ర ప్రభుత్వం స్థిరంగా కొనసాగేందుకు అవసరమైన మెజారిటీని కట్టబెట్టిన రాష్ట్రం. గత అనుభవాలను గుణపాఠాలుగా చేసుకొని చంద్రబాబు సైతం కేంద్ర పెద్దలతో సఖ్యతగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో ఈ ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్కు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. ఏకంగా డేటా సెంటర్ పాలసీలను మార్చింది. ఇది ఒక విధంగా చంద్రబాబు కృషి ఫలితమే.

Exit mobile version