Neeraj Singh: అప్పుడు సెక్యూరిటీ గార్డు.. ఇప్పుడు రూ.400 కోట్ల కంపెనీకి యజమాని.. ఇతని గురించి మీకు తెలుసా? – Telugu News | From security guard to Rs 400 crore industrialist, meet Neeraj Singh who now enters Bihar poll arena from Sheohar

Neeraj Singh: బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని శివహార్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జన్సురాజ్ పార్టీ అభ్యర్థిగా నీరజ్ సింగ్‌ను ప్రకటించారు. అయితే ఇతను ఒకప్పుడు సైకిల్ కొనాలని కలలు కన్నాడు. నేడు తన కృషి, అంకితభావంతో రూ.400 కోట్ల టర్నోవర్ కలిగిన ఉషా ఇండస్ట్రీస్ అనే కంపెనీని కలిగి ఉన్నారు. 38 ఏళ్ల నీరజ్ సింగ్ ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం కఠినమైన పోరాటం, పట్టుదల, దృఢ సంకల్పానికి ఒక ఉదాహరణ.

ఇది కూడా చదవండి: Diwali 2025 Stock: దీపావళికి టాప్‌ 5 షేర్లు.. కొన్నారంటే చాలు భారీ లాభాలు!

బీహార్‌లోని మధురాపూర్ గ్రామానికి చెందిన నీరజ్ సింగ్ 2000 సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ జార్ఖండ్‌కు వెళ్లాడు. కానీ చిన్న వయసు కారణంగా ఉద్యోగం దొరకలేదు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తన గ్రామంలో పెట్రోల్, డీజిల్ అమ్మడం ప్రారంభించాడు. తరువాత 2003లో నీరజ్ ఢిల్లీకి వెళ్లి సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. జీవితం ముందుకు సాగేందుకు రెండు షిఫ్టులు పనిచేశాడు. ఆ తర్వాత 2004లో పూణేకు వెళ్లాడు. అక్కడ ఆఫీస్ బాయ్‌గా పనిచేయడం ప్రారంభించాడు. తరువాత HR అసిస్టెంట్ అయ్యాడు. తన అమ్మమ్మ మరణం తర్వాత అతను బీహార్‌కు తిరిగి వచ్చాడు. 2010లో మోతీహరిలోని ఒక మైక్రోఫైనాన్స్ కంపెనీలో నెలకు రూ.3,300 కు ఉద్యోగంలో చేరాడు. అక్కడ అతను వ్యాపారం, మార్కెట్‌పై అవగాహన పొందాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: లక్షన్నర వైపు గోల్డ్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న బంగారం ధర.. తులం ఎంతంటే..

25,000తో వ్యాపారం ప్రారంభించాడు:

బంధువు భూమి కొనుగోలుకు సహాయం చేసినందుకు నీరజ్ రూ.25,000 అందుకున్నాడు. చిన్న ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అది క్రమంగా రూ.20-30 కోట్ల వ్యాపారంగా పెరిగింది. ఆ తర్వాత అతను టైల్స్, ఫైబర్ బ్లాక్స్, ఫ్లై యాష్ ఇటుకలు, రోడ్డు నిర్మాణం, పిండి మిల్లులు వంటి వివిధ రంగాలలోకి అడుగుపెట్టాడు. నేడు అతని కంపెనీ ఉషా ఇండస్ట్రీస్ 2,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. అతని కంపెనీ ప్రభుత్వ ప్రాజెక్టులకు ఉత్పత్తులు, సేవలను సరఫరా చేస్తుంది. నీరజ్ సింగ్ 2025లో శివహార్-మోతిహారి రోడ్డులో తన సొంత పెట్రోల్ పంపును కూడా ప్రారంభించాడు. ఒకప్పుడు రోడ్డు పక్కన పెట్రోల్‌ అమ్ముకున్న నీరజ్‌.. ఇప్పుడు పెట్రోల్‌ పంపునే ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నా..

నీరజ్ బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ విశ్వవిద్యాలయం (ముజఫర్‌పూర్) నుండి బ్యాచిలర్ డిగ్రీ, ఎల్‌ఎల్‌బి పట్టా పొందారు. ఆయన విజయవంతమైన వ్యవస్థాపకుడు, దాత. గత దశాబ్ద కాలంగా ఆయన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక అభ్యున్నతి రంగాలలో చురుకుగా పనిచేస్తున్నారు. రాజకీయాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని తాను ఇప్పుడు కోరుకుంటున్నానని ఆయన చెబుతున్నారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశ నవంబర్ 6, రెండో దశ నవంబర్ 11 తేదీలలో పోలింగ్‌ జరుగనుంది. ఇక ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.

ఇది కూడా చదవండి: IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్ల విషయంలో కొత్త విధానం

ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment