Homestays In Tirupati: తిరుపతి వెళ్లినా రూం దొరకలేదా? ఇక చింత అవసరం లేదు

Homestays In Tirupati: సాధారణంగా తిరుపతి( Tirumala Tirupati) వెళ్లేవారు చాలా రకాలుగా ప్లాన్ చేసుకుంటారు. స్వామి వారి దర్శనం తో పాటు వసతి విషయంలో ముందుగానే అప్రమత్తమవుతారు. ముఖ్యంగా రాజకీయ నేతల సిఫారసు లేఖలకు ఎక్కువగా పరితపిస్తుంటారు. దర్శనం వరకు ఒకే కానీ బస చేసేందుకు ఏంటి అని ఆలోచన చేస్తుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వెళ్లేవారు చిన్నపాటి ఆందోళనకు గురవుతారు. అయితే ఇకనుంచి అటువంటి పరిస్థితి లేదు. తిరుపతి నగరంలో భక్తుల వసతికి సంబంధించి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా హోమ్ స్టే సంస్కృతి పెరిగింది. అన్ని వసతులతో ఇది అందుబాటులోకి రావడంతో భక్తులు డబ్బులకు చూడడం లేదు. వాటిలో స్టే చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సొంతింటి మాదిరిగా అక్కడ బస చేయవచ్చు. ఇంటి భోజనం తయారు చేసుకునే సౌకర్యం అక్కడ ఉంటుంది. దీంతో భక్తులకు బడలిక ఉండదు.

* చక్కటి ఇంటి భోజనంతో..
సాధారణంగా తిరుమల వచ్చేవారు ప్రైవేటు హోటల్లో ఎక్కువగా గదులు తీసుకుంటారు. టిఫిన్ తో పాటు భోజనం కూడా అక్కడే తీసుకుంటారు. అయితే కొందరికి ఇంటి భోజనం మాత్రమే సరిపోతుంది. హోటల్ వాతావరణం నచ్చదు. అటువంటి వారి కోసమే నగరవ్యాప్తంగా హోమ్ స్టీలు అందుబాటులోకి వచ్చాయి. వైఫై ఇంటర్నెట్, ఏసి, టీవీ, వంట గదులు అందుబాటులో ఉంటాయి. నచ్చిన ఆహారాన్ని తయారు చేసి తినే ఫెసిలిటీ ఉంటుంది. మనం చేరే సమయానికి 24 గంటల వరకు ఓం స్టే లో గడపవచ్చు. అటు సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది. అందుకే భక్తుల విలువైన వస్తువులకు రక్షణ ఉంటుంది.

* సౌకర్యవంతంగా..
టీటీడీ వసతి గృహాలు పరిమిత సంఖ్యలోనే తిరుమలలో ఉంటాయి. అందుకే భక్తులకు అవసరం అయినప్పుడు దొరకడం కష్టం. మరోవైపు పేరు మోసిన హోటల్ లో దిగాలంటే అధికంగా డబ్బులు చెల్లించుకోవాల్సిందే. అందుకే సామాన్య భక్తుల కోసం తిరుపతి నగరంలో హోం స్టేలు అందుబాటులోకి వచ్చాయి. నగరవ్యాప్తంగా ఇందుకు సంబంధించిన బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొండపై స్వామి వారిని దర్శించుకుని.. కొండ కింద హోమ్ స్టే లో భక్తులు గడుపుతున్నారు.

అయితే ఈ హోమ్ స్టేలు పుణ్యమా అని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. ఒక్కో హోమ్ స్టే లో రిసెప్షనిస్ట్, హౌస్ కీపింగ్, క్లీనింగ్ స్టాప్, అటెండర్లు అవసరం. ఈ విభాగాల్లో ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉపాధి మెరుగుపడింది. చిన్న చిన్న వ్యాపారాలు కూడా పెరిగాయి. తిరుపతి నగరంలో సుమారు 350 వరకు హోం స్టేలు ఉన్నాయి. ఒక్కో కుటుంబంలోని ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉంటే 24 గంటలకు 1500 నుంచి 2000 రూపాయల వరకు అవుతోంది. ఇక రెండు కుటుంబాలు కలిసి ఉండే హోం స్టేలకు మూడు వేల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు. అయితే తిరుపతి ప్లాన్ చేసుకునేవారికి ఈ బడ్జెట్ ఎంతగానో ఆమోదయోగ్యంగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది హోం స్టేల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

Leave a Comment