Site icon Desha Disha

Gold Price Today: లక్షన్నర వైపు గోల్డ్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న బంగారం ధర.. తులం ఎంతంటే.. – Telugu News | Gold Price Today: Gold and Silver Rate in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities on October 16

Gold Price Today: లక్షన్నర వైపు గోల్డ్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న బంగారం ధర.. తులం ఎంతంటే.. – Telugu News | Gold Price Today: Gold and Silver Rate in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities on October 16

Gold Price Today: బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తులం ధర ఇప్పుడు లక్షా 30 వేలకు చేరుకుంది. ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో పెట్టుబడిదారులలో అత్యంత విశ్వసనీయమైన, సురక్షితమైన పెట్టుబడులుగా పరిగణిస్తున్నారు. గురువారం దేశంలో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం ధరలు కొత్త రికార్డును చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,000 దాటి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు ఈ పెరుగుదలకు కారణం.

తాజాగా అక్టోబర్‌ 16న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,660 ఉంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.1,90,100 ఉంది. ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,07,100 ఉంది. అంటే కిలో వెండి రెండు లక్షల రూపాయలు దాటేసింది. ఇది కూడా రానున్న రోజులలో మరింతగా పెరిగే అవకాశాల ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Diwali Bonus: దీపావళి ఇచ్చే బోనస్‌లపై ట్యాక్స్‌ ఉంటుందా? పన్ను నియమాలు తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బంది పడతారు!

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,810 ఉంది.
  2. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,660 ఉంది.
  3. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,660 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,660 ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,390 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,610 ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,660 వద్ద కొనసాగుతోంది.

పెట్టుబడిదారుల మొదటి ఎంపిక బంగారం, వెండి:

ఆర్థిక, భౌగోళిక రాజకీయ అస్థిరత మధ్య ఈ రోజుల్లో పెట్టుబడిదారులు బంగారం, వెండిని ఇష్టపడే ఎంపికగా నిపుణులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధరలు 55% పెరిగాయి. ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన మెరుగుదల. గత 20 సంవత్సరాలలో 2005లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.7,638గా ఉంది. ఇప్పుడు రూ. 1లక్షా 30వేల వరకు చేరుకుంది. ఈ కాలంలో బంగారం 16 సంవత్సరాలలో సానుకూల రాబడిని అందించింది. ఇది నమ్మదగిన పెట్టుబడి ఎంపికగా మారింది.

ఇది కూడా చదవండి: Indias Wealthiest Village: ఇది మన దేశంలో అత్యంత సంపన్న గ్రామం.. లగ్జరీ కార్లు, బ్యాంకు డిపాజిట్లు రూ. 1,000 కోట్లు.. ఇక్కడ వారిదే ఆధిపత్యం

ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version