Delhi High Court: కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జంతువులకు ఆ అవసరం లేదు . మనుషుల మీద మనకు ఆ విచక్షణ ఉండాలి. కళ్ళ ముందు అమ్మాయి ఉంది.. ఏం చేసినా తలుపూతుంది.. గిల్లినా ఏం కాదు.. గిచ్చినా ఏం కాదు. రెచ్చగొడితే వచ్చి ఒడిలో వాలుతుంది.. ఆ తర్వాత ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది.. పైగా రెచ్చగొడుతుంది.. అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నేటి కాలంలో గోడలకు చెవులు ఉన్నాయి.. మనం వాడే ఫోన్లకు కెమెరాలు ఉన్నాయి. అన్నిటికంటే లాప్టాప్ లకు అత్యంత విశాలమైన నిఘా నేత్రాలు ఉన్నాయి.
ఆయన ఓ లాయర్. ఢిల్లీ హైకోర్టులో పని చేస్తుంటారు. సార్ గారికి పరమ బద్ధకం. అడుగు తీసి అడుగు వేయాలంటేనే చిరాకు. అందువల్లే ప్రతిదీ కాళ్ల దగ్గరికి రావాలని కోరుకుంటాడు. అదేదో సినిమాలో ఆహుతి ప్రసాద్ బద్ధకిస్ట్ లాగా కనిపిస్తుంటాడు కదా.. ఈ సార్ కూడా అంతే.. ఇంతటి బద్ధకం ఉన్న ఇతడు లాయర్ ఎలా అయ్యాడు.. హైకోర్టులో ఎలా వాదిస్తున్నాడు.. ఇప్పటికి ఒక డౌటానుమానమే. పైగా ఈ లాయర్ సారు కేసులను కోర్టుకు వెళ్లి విచారించడు. ఏదో ఒక కారణం చెప్పి వర్చువల్ విచారణకు హాజరవుతుంటాడు. ఇలా వర్చువల్ విచారణకు హాజరయ్యే అతడు ఈసారి అడ్డంగా బుక్కయ్యాడు. అందరు చూస్తుండగానే పడు పని చేసి పరువు తీసుకున్నాడు.
ఢిల్లీ హైకోర్టులో పని చేసే ఆ లాయర్ ఒకే కు సంబంధించి వర్చువల్ విచారణకు హాజరయ్యాడు. ఈ క్రమంలో లాయర్ దుస్తులు కూడా ధరించాడు. అయితే అప్పటికి న్యాయమూర్తి రాలేదు. న్యాయమూర్తి రాలేదు కాబట్టి.. ఈ గ్యాప్ లో ఏదైనా చేద్దామనుకున్నాడు. ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి. కళ్ళముందు అమ్మాయి కైపు ఎక్కించే విధంగా ఉంది. ఇంకేముంది తన ఉద్వేగాన్ని మొదలుపెట్టాడు. ఉద్రేకాన్ని ఆపుకోలేక ఆ అమ్మాయిని తన వైపు లాక్కున్నాడు. చేయాల్సిన పనులు చేశాడు. చివరికి ఆమెకు ముద్దు కూడా పెట్టాడు. ఇన్ని చేసే తొందరలో ఉన్న అతడు తన కంప్యూటర్ కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయాడు. దీంతో అతడి గారి సరస సల్లాపాల చరిత్ర మొత్తం కాదు కాదు లైవ్ మొత్తం అందరికీ కనిపించింది.. సభ్యత ఉన్నవాళ్లు కళ్ళు మూసుకున్నారు. అది లేని వాళ్ళు కళ్ళు ఇంతలు చేసి చూశారు. అయినా నేటి కాలంలో నీటి కంటే బూతుకే విలువ ఎక్కువ కదా. అప్పట్లో కేరళలో మోహన్‌లాల్ సినిమాల కంటే షకీలా సినిమాలు ఎక్కువ ఆడాయి అంటే ప్రత్యేకంగా కారణం చెప్పాలా.. ఇది కూడా అంతే.. న బూతే న భవిష్యతి!
Viral Video Captures Lawyer Kissing Woman in Delhi High Court Virtual Hearing
Welcome to Digital India Justice
Court is online… but judge forgot it’s LIVE!
Camera toh off karlete pic.twitter.com/gzfvi5oTXh
— Sumit (@SumitHansd) October 15, 2025